అన్వేషించండి

వైరల్ వీడియో: ఈ యువతి చేసిన పనికి.. ముందు కోపం వస్తుంది.. ఆ తర్వాత నవ్వు వస్తుంది

ఓ యువతి తన కాళ్లను వాష్‌బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. వీడియోను చివరి వరకు చూస్తే నవ్వు ఆపుకోలేరు. పిచ్చి వేషాలు వేస్తే ఇంతే మరి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే కొన్ని వీడియోలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి కదూ. అయితే, ఈ వీడియో కూడా మిమ్మల్ని ముందుగా కోపానికి గురి చేస్తుంది. ఆ తర్వాత కడుపుబ్బా నవ్విస్తుంది. ఆమెకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటారు. ఇక వీడియో విషయంలోకి వస్తే.. ఈ వీడియోలో అమ్మాయి తన కాళ్లను వాష్ బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకోడానికి ప్రయత్నించింది. హైహీల్స్ వేసుకున్న ఆమె ముందుగా తన ఎడమ కాలిని పైకెత్తి వాష్‌ బేసిన్‌లో పెట్టి శుభ్రం చేసుకుంది. ఆ తర్వాత కుడి కాలిని పెట్టింది. దీంతో ఆమె ఎడమ కాలు మడతడింది. అంతే.. ఆమె దెబ్బకు కిందపడి కుయ్యో మొర్రో అని కేకలు పెట్టింది. 

ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెకు అలా జరగాల్సిందేనని అంటున్నారు. మరెప్పుడు అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాగే బుద్ధి రావాలని కామెంట్లలో తెలుపుతున్నారు. పబ్లిక్ టాయిలెట్‌లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బందేనని పలువురు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి. 

వీడియో:

మరికొన్ని వైరల్ వీడియోలను ఇక్కడ చూడండి: పెళ్లంటే.. ఎంత పెద్ద పండగో మనకు తెలిసిందే. అందుకే, ఈ పెళ్లిని జీవితంలో మరపురాని విధంగా చేసుకోవాలని చాలామంది భావిస్తారు. ఇందుకు భారీగానే ఖర్చుపెడతారు. సంపన్నుల ఇళ్లల్లో పెళ్లిలైతే.. సంజయ్‌ లీలా బన్సాలీ సెట్టింగుల్లో భారీతనం ఉట్టిపడేలా ఉంటాయి. సామాన్యుడికైనా.. సంపన్నుడికైనా సరే పెళ్లంటే పండగే. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుకలో సరదాలు, సంతోషాలే కాదు.. భావోద్వేగాలు కూడా కనిపిస్తాయి. ఈ పెళ్లిలో కూడా అంతే.. వధువును చూసి ఆ వరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, బాధతో కాదండోయ్. చెప్పలేనంత సంతోషం.. అతడి కంటి నుంచి ఆనందభాష్పాలుగా బయటకు వచ్చింది. ఇంతకీ అతడు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నాడనేగా సందేహం? పెళ్లి దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న వధువును చూసి.. ఆ వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది అతడు తన కళ్లతోనే చెప్పేశాడు. అతడిని చూసి వధువు కూడా ఏడ్చేసింది. అతడి కన్నీటిని తుడిచేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇదంతా కెమేరాలకు చిక్కింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Watch Video: వధువును అలా చూసి బోరున ఏడ్చిన వరుడు.. వీడియో వైరల్

కొండ చిలువ మనిషిని సైతం మింగేయగలదు. శరీరాన్ని చుట్టేసి.. పిండి చేసి వెంటనే ప్రాణాలు తీస్తుంది. దాని పట్టు నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు. అందుకే అడవిలోని జంతువులు దానికి ఎదురెళ్లడానికే భయపడిపోతాయి. పాపం.. ఆ కోతి ఎలా చిక్కిందో ఏమో, ఓ కొండ చిలువ నోటికి చిక్కి విలవిల్లాడింది. అయితే, కొండ చిలువ దాన్ని పూర్తిగా మింగలేక.. బయటకు కక్కలేక విలవిల్లాడింది. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటుచేసుకుంది. వడోదరకు సమీపంలోనరి వస్నా-కొటరియా గ్రామం సమీపంలోని నదీ తీరంలో 11 అడుగుల పొడవైన కొండ చిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షకుడు శైలేష్ రావల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకున్నారు. అయితే, అప్పటికే ఆ కొండ చిలువ ఓ కోతిని వేటాడి సగం వరకు మింగేసింది. దాన్ని పూర్తిగా మింగలేక, బయటకు కక్కలేక విలవిల్లాడుతూ కనిపించింది. దీంతో శైలేష్ దాన్ని కరేలీ‌బౌగ్‌లోని రెస్క్యూ సెంటర్‌కు తరలించారు. అనంతరం కొండచిలువ నోటి నుంచి కోతిని వెలికి తీశారు. అప్పటికే ఆ కోతి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ కొండ చిలువను అడవుల్లో వదిలిపెట్టారు. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి. 
Watch Video: కోతిని మింగేసిన కొండ చిలువ.. జనాలు బెంబేలు

Also Read: బతికున్న పామును కరకరా నమిలేస్తూ.. ఈ యువకుడిది హైదరాబాదేనా..  

Also Read: అది దెయ్యమేనా? కెమేరాకు చిక్కిన వింత ఆకారం.. నాగపూర్ ప్రజల్లో గుబులు!

Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli , MS Dhoni News: ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
IPL 2026 GT vs SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌, స‌త్తా చాటిన సుద‌ర్శ‌న్, ర‌బాడ‌, హోల్డ‌ర్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో SRH ఘోర ప‌రాజ‌యం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన‌
NEET-UG Paper Leak: నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
నాసిక్‌ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సీకర్ హాస్టల్ వరకు! నీట్‌ పేపర్ లీకేజీలో షాకింగ్‌ నిజాలు ఇవే!
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 12 May 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget