Chandra Babu: చంద్రబాబు ఒకే రకమైన డ్రెస్‌తో ఎందుకు కనిపిస్తారు? ప్రపంచంలో చాలా మంది దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు?
Chandra Babu: చంద్రబాబు, జుకర్‌బర్గ్ లాంటి వాళ్లను ఎప్పుడైనా గమనించారా? ఎంత పెద్ద కార్యక్రమమైనా ఒకే రకరమైన డ్రెస్‌తో కనిపిస్తారు. చాలా మందికి ఈ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. కానీ....

Why Do Some People Wear Same Type Of Dress All The Time: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును గమనిస్తే ఆయన ఏ సందర్భంలోనైనా సరే ఒకేరకమైన డ్రెస్ వేస్తారు. విదేశాలకు వెళ్లినా ఇండియాలో ఏ రాష్ట్రాల్లో పర్యటించినా, తెలుగు రాష్ట్రాల్లో ఏ శుభకార్యానికి పొలిటికల్ సభలకు వెళ్లినా డ్రెస్ కోడ్ మారదు. చాలా మందికి ఈ విషయంలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. కానీ మీరు అనుకునే కారణాలు ఏవీ కూడా నిజం కాదు. ఇలా ఈ ప్రపంచంలో చంద్రబాబులా ఒకే రకమైన డ్రెస్ వేసుకొని ఉండే ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వాళ్లను మీరు ఎప్పుడూ గమనించి ఉండరు. అందుకే చంద్రబాబు డ్రెస్సింగ్‌పై అనేకే సందేహాలు ఉన్నాయి. ఈ స్టోరీ చదివిన తర్వాత అనుమానాలు మీ మైండ్‌లో నుంచి తీసేయొచ్చు. మీరు కూడా అలానే మారే ఛాన్స్ కూడా ఉంది.
చంద్రబాబు మాదిరిగానే స్టీవ్ జాబ్స్, మార్క్ ్జుకర్ బర్గ్, బరాక్ ఒబామా ఎప్పుడూ ఒకేరకమైన దుస్తుల్లో కనిపిస్తారు. స్టీవ్ జాబ్స్ అయితే నల్లటి టర్టిల్‌నెక్, జీన్స్ వేసుకునేవాళ్లు. మార్క్ జుకర్ బర్గ్ బూడిద రంగు టీ షర్టు వేసుకుంటారు. ఒరాక్ ఒబామా బ్లూ లేదా గ్రే సూట్‌లో దర్శనమిస్తారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గ్రే సూట్‌లో కనిపించేవాళ్లు. అన్నా వింటూర్ కూడా ప్రత్యేకమైన నెక్సెస్‌తో కూడిన ఫ్లోరల్ డ్రెస్‌లో కనిపించేవాళ్లు.
పెద్ద కారణమే ఉంది
ప్రపంచంలోని ప్రముఖులంతా ఇలా ఒకే రకమైన దుస్తుల్లో కనిపించడానికి చాలా పెద్ద కారణం ఉంది. వీళ్లకు బట్టలంటే అలెర్జీ లేదు, ఎలాంటి వ్యాధులు కూడా లేవు. కానీ వారి ఎదుగుదలలో ఈ డ్రెస్‌లు చాలా కీలక పాత్ర పోషించాయి. అందుకే నిత్యం ఒకే డ్రెస్‌లో కనిపిస్తుంటారు.
నిర్ణయాలు తీసుకునే భారం తగ్గుతుంది
ఒకే రకమైన డ్రెస్ వేసుకోవడం వల్ల మీకు చాలా సమయం మిగులుతుంది. రోజూ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన మీకు రాదు. దీని కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి చెక్ చేసుకోవాల్సిన పని లేదు. దీని వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.
డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి మ్యాచింగ్ ఉందా లేదా, ఎవరు ఏం అనుకుంటారో మనకు ఆ డ్రెస్ నప్పిందా లేదా అనే అనుమానాలు చాలా మందిని మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతి రోజూ కొందరు మానసిక సంఘర్షణకు లోనువుతూ ఉంటారు. ఒకే రకమైన డ్రెస్ వేసుకున్న వారిలో దుస్తులపై ఎలాంటి మానసిక సంఘర్షణ ఉండదు.
ఇలా చిన్న చిన్న విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటుకు గురి అవుతుంటారు. డెసిషన్ ఫెటిగ్‌తో బాధపడుతుంటారు. అందుకే ఏ దుస్తులు వేసుకోవాలనే ఆలోచన లేకపోతే... మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ శక్తిని వేరే చోట పెట్టేందుక వీలు కలుగుతుంది.
స్పష్టత పెరుగుతుంది
దుస్తులు గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఆందోళన పడటం కంటే ఒకే రకమైన దుస్తులు వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు. వేరే వాళ్ల దుస్తులు చూసి బాగున్నాయే నా డ్రెస్ బాగాలేదనే భావన రాదు. ముఖ్యమైన పనులపై ఎక్కువ ఫోకస్ పెట్టొచ్చు. ఉత్పాదకతపై దృష్టి పెట్టొచ్చు అంటారు జుకర్‌బర్గ్ లాంటి విజేతలు.
సమయం ఆదా
మీరు షాపింగ్ వెళ్లినప్పుడు డ్రెస్ కొనాలంటే ఎంత సమయం వృథా అవుతుందో తెలుసుకదా. అది నిజంగా ఉత్పత్తి లేని విషయం. ఆరునెలల్లోనో సంవత్సరంలోనో చినిగిపోయే దుస్తుల కోసం అంత సమయం వృథా చేయడం మంచిది కాదని విజేతల మాట. అందుకే ఒకే రకమైన దుస్తులు వేసుకుంటే షాపింగ్‌కు వెళ్లి గంటలతరబడి టైం వేస్టు చేయాల్సిన పని లేదని అంటారు. వాటిని ఉతకడం, వాటిని ఐరన్ చేయడం లాంటివి కూడా ఉండవు. అలాంటి దుస్తులనే వీళ్లు ఎంచుకుంటారు.
డబ్బులు ఆదా అవుతాయి
ఫ్యాషన్ ఫాలో అవుతూ కొత్త కొత్త దుస్తులు కోనాల్సిన పని లేదు. పదే పదే షాపింగ్ చేసే పని కూడా ఉండదు. ఒకవిధమైన బడ్జెట్‌లో షాపింగ్ అయిపోతుంది. కొత్త ఫ్యాషన్ ట్రై చేసి ఇబ్బంది పడ్డవాళ్లను చూస్తూనే ఉంటాం. ఇలా ఒకేరకమైన దుస్తులు ధరించే వాళ్లకు ట్రెండ్‌తో సంబంధం ఉండదు. వాళ్లు చాలా సౌకర్యవంతంగా ఉంటారు. ఏ వాతావరణంలోనైనా సర్దుకుపోగలరు.
ప్రత్యేకత తీసుకొస్తాయి
మీరు ఒకే రకమైన దుస్తులు వేసుకోవడం వల్ల మీకు ప్రత్యేకత వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు, జుకర్‌బర్గ్, ఒబామా లాంటి వాళ్లు ఈ పని చేయడం వల్ల వాళ్ల డ్రెస్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. అదే మీరు ప్రారంభిస్తే మీ సర్కిల్‌లో మీ గురించి ఇలానే మాట్లాడుకుంటారు.
ఇలా ఒకే రకమైన దుస్తులు ధరించే వాళ్లు అన్నింటి కంటే ముఖ్యంగా మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. అనుకున్న లక్ష్యం సాధించడంలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోరు. ఇలా ఒకేరకమైన దస్తులు ధరించే వాళ్లంతా వారి వారి రంగాల్లో టాప్‌లోనే ఉన్నారు.





















