Karnataka: కన్నడం నేర్చుకోకుండా బెంగళూరులో ఎలా ఉంటున్నావు ? వైరల్ అవుతున్న వీడియో - నెటిజన్ల రియాక్షన్ తెలుసా ?
Kannada: బెంగళూరులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కన్నడ మాట్లాడలేని వారి వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో పన్నెండేళ్లుగా ఉంటున్నా కన్నడ రాదని చెప్పిన వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది.
Bengaluru man confronts non Kannada speaker: గ్లోబల్ సిటీగా మారిన బెంగళూరులో భాషా పరమైన వివక్ష పెరుగుతూ వస్తోంది. ఇటీవల కన్నడ నేర్చుకున్న వాళ్లు మాత్రమే బెంగళూరులో ఉండాలంటూ కొంత మంది చేసిన వివాదం కలకలం రేపింది. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అయింది. పెన్నెండేళ్లుగా బెంగళూరులో ఉంటున్న ఓ వ్యక్తితో కన్నడ వచ్చిన మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు. పన్నెండేళ్లుగా ఉంటున్నా ఎందుకు స్థానిక భాష నేర్చుకోలేదని ఆయన ఎదుటి వ్యక్తిని నిలదీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This is Good. Question the Lazy folks
— ಲಕ್ಷ್ಮಿ ತನಯ (@ManjuKBye) October 30, 2024
12yrs in Karnataka and yet to understand and learn Kannada?
That says only Two things, Zero Curiosity and willingness to Learn, Arrogance towards Local Culture and Language.#Kannada #Karnataka pic.twitter.com/fdkosPscKc
తాను ఆరు నెలల కిందట బెంగళూరుకు షిఫ్ట్ అయ్యానని తనకు బెంగళూరులో భద్రత ఉందా అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. దానికి ట్వీట్ చేసిన మంజు అనే వ్యక్తి కన్నడ నేర్చుకోవాలని ఉచిత కన్నడ నేర్పించే వెబ్ సైట్ పేరును సజెస్ట్ చేశాడు.
I shifted 6 months back .. am I safe from this ?
— Avinash (@avinashology) October 30, 2024
ఈ వీడియోపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కాదని ఓ భాష నేర్చుకోవాలని ఎవరూ డిక్టేట్ చేయలేరని ఓ నెటిజన్ స్పందించారు.
Who the hell you are ask us to learn Kannada. Its none of your business. It’s our wish whether to learn or not. You don’t have any right to make it mandatory. Its not an arrogance, its his wish. You stay in AP or Telangana and we never force you to learn Telugu Language. This is…
— Venkatesh Alla (@alla_cma) October 30, 2024
కొంత మంది లోకల్ లాంగ్వేజ్ నేర్చకోవడం వల్ల మంచే జరుగుతుందని సలహా ఇచ్చారు. [
You will be benefited by learning the local language. Leave your arrogance aside. As an Indian, you should've realised the importance of learning the local language. Take interest in learning and see the benefits.
— Shekar Krishnan (@shekar_krishnan) October 31, 2024
భాష నేర్చుకోవడానికి ఇబ్బంది లేదు కానీ.. మోరల్ పోలీసింగ్ చేయడాన్ని మాత్రం ఎవరూ అంగీకరించబోరని మరో నెటిజన్ సమాధానమిచ్చారు.
Good one. Agree with you. Everyone should respect local language and traditions. That doesn’t mean that local people can force non locals to learn their language. It’s up to them whether they are willing to learn or not.
— Venkatesh Alla (@alla_cma) October 31, 2024
మొత్తంగా బెంగళూరులో కన్నడిగుల బాషాభిమానం.. ఇలా మోరల్ పోలీసింగ్ చేసే స్థాయికి వెళ్లడం ఉద్యోగాల కోసం వచ్చిన వారిని ఆందోళనకు గురి చేసేలా మారుతోంది.