అన్వేషించండి

Pilot Shambhavi Pathak: కెప్టెన్ శాంభవి పాఠక్ - పాతికేళ్లకే ఎంతో ఎత్తుకు ఎదిగిన పైలట్ - కానీ ..!

Plane crash: బారామతి విమానప్రమాదంలో మరణించిన వారిలో పైలట్ శాంభవి పాఠక్ ఒకరు. పాతికేళ్లకే ఆమె ఎన్నో విజయాలు సాధించారు. కానీ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు.

Who was Captain Shambhavi Pathak:  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదంలో యువ పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్  కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆకాశమే హద్దుగా ఎదగాలనుకున్న ఒక యువతి కలలు అర్థాంతరంగా ముగిసిపోయినప్పటికీ, ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 

కెప్టెన్ శాంభవి పాఠక్ - ఆకాశపు కలలు కన్న వీరనారి అస్తమయం

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన 25 ఏళ్ల శాంభవి పాఠక్, చిన్నప్పటి నుంచే గగనతలంలో విహరించాలని కలలు కనేవారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమె, పైలట్ కావాలనే తన లక్ష్యం కోసం ఎంతో కష్టపడ్డారు.  కెప్టెన్ శాంభవి పాఠక్ విమానయాన ప్రయాణం ఎంతో పట్టుదలతో కూడుకున్నది. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఏరోనాటిక్స్, ఏవియేషన్ , ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్  డిగ్రీని పొందిన ఆమె, తన కెరీర్ ప్రారంభంలో మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్‌లో అసిస్టెంట్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. ఆమె వద్ద  ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ రేటింగ్ (A)  ఉండటమే కాకుండా, భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) నుండి  ఫ్రోజన్ ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్  కూడా సాధించారు.

శాంభవి పాఠక్ పొందిన లైసెన్స్‌లు , ధృవపత్రాలు

 భారతదేశపు డీజీసీఏ (DGCA) నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్.
 న్యూజిలాండ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్.
 స్పైస్‌జెట్ లిమిటెడ్ నుండి ఏవియేషన్ సెక్యూరిటీ (AVSEC) సర్టిఫికేషన్ 
 జోర్డాన్ ఎయిర్‌లైన్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్ నుండి A320 విమానంపై జెట్ ఓరియంటేషన్ ట్రైనింగ్ 
 ఐసీఏఓ (ICAO) ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లెవల్ 6 గుర్తింపు 
 మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్ నుండి ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ రేటింగ్ 

పాతికేళ్ల వయసులోనే ఎంతో అనుభవం
  
విమానయాన రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నప్పటికీ, శాంభవి తన నైపుణ్యంతో పురుష ప్రాబల్యం ఉన్న ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు కూడా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో విధుల్లో చేరారు. ఆమె సహచరులు ,శిక్షకులు శాంభవిని ఒక అత్యంత ప్రతిభావంతురాలైన మరియు క్రమశిక్షణ కలిగిన పైలట్‌గా అభివర్ణిస్తారు. అత్యవసర సమయాల్లో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి ఆమెకు ఉండేదని వారు గుర్తు చేసుకుంటున్నారు.

క్రాష్ ల్యాండ్ కాకుండా చూసేందుకు గట్టి ప్రయత్నం

బారామతి వద్ద జరిగిన ఆ ఘోర ప్రమాదంలో, విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఆమె చివరి నిమిషం వరకు పోరాడినట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపం తలెత్తినప్పుడు జనసాంద్రత లేని ప్రాంతం వైపు విమానాన్ని మళ్లించి, మరింత ప్రాణనష్టం జరగకుండా ఆమె ప్రయత్నించినట్లు ప్రాథమిక సమాచారం బట్టి అర్థమవుతోంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ప్రాణత్యాగం చేయడం ఆమె సాహసానికి నిదర్శనం.
 
శాంభవి మరణం ఆమె కుటుంబానికి మాత్రమే కాదు, దేశంలోని యువతులకు కూడా పెద్ద నష్టం. ఎంతో మంది ఆడపిల్లలు పైలట్ వృత్తిని ఎంచుకోవడానికి ఆమె ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. ఘాజీపూర్ వంటి చిన్న పట్టణం నుండి వచ్చి, ఆకాశాన్ని తాకిన ఆమె ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.   

టాప్ హెడ్ లైన్స్

ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 27 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Cyclone Arnab Live Updates: బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
బుధవారం ఉదయం యానాం వద్ద తీరం దాటనున్న అర్నబ్ తుపాను
AP NTR Bharosa Pension: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి ఎస్‌ఈసీ గ్రీన్ సిగ్నల్
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పింఛన్ల పంపిణీకి AP SEC గ్రీన్ సిగ్నల్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget