Justin Trudeau : ట్రూడో రాజీనామా తరువాత కెనడా ప్రధాని పదవి రేసులో ఉన్న పోటీదారులు వీళ్లే
Justin Trudeau : సొంత పార్టీ నుంచే అసమ్మతిని ఎదుర్కొంటున్న జస్టిన్ ట్రూడో జనవరి 6న లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త నాయకున్ని ఎన్నుకున్న తర్వాత తాను పార్టీ నేత పదవికి, ప్రధాని పదవి రెండింటికి రాజీనామా చేస్తానని చెప్పారు. కొంత కాలంగా సొంత పార్టీ నేతలే ట్రూడో వైదొలగాలంటూ చేసిన డిమాండ్ల నేపథ్యంలో తాజాగా ఆయన ఈ ప్రకటన చేశారు. జనవరి 6న ట్రూడో అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ తదుపరి నాయకుడిగా ఎవర్ని ఎన్నుకుంటున్నా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. వారిలో కొందరు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో క్రిస్టియా ఫ్రీలాండ్, డొమినిక్ లెబ్లాంక్, మెలానీ జోలీ, మార్క్ కార్నీ, పియర్ పోయిలీవ్రే, అనితా ఆనంద్ రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిస్టియా ఫ్రీలాండ్
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, క్రిస్టియా ఫ్రీలాండ్ కెనడా ప్రధాని పదవికి పోటీ పడుతున్న వారిలో ఒకరు. మాజీ ఉపప్రధాని, ఆర్థిక మంత్రి అయినందున, ఆమె పార్టీని నడపగలదని పలువురు భావిస్తున్నారు. ఇటీవల రాజీనామా చేసిన తన లేఖలోనూ ట్రూడోను విమర్శించిన ఆమె.. రాజకీయాల్లోకి రాకముందు, ఆమె పాత్రికేయురాలిగా పనిచేసింది. టొరంటోలోని ది గ్లోబ్ అండ్ మెయిల్‌లో సీనియర్ ఎడిటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
డొమినిక్ లెబ్లాంక్
క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేసిన తర్వాత డొమినిక్ లెబ్లాంక్ కెనడాకు ఆర్థిక మంత్రి అయ్యారు. ఆయన ట్రూడో అత్యంత సన్నిహిత, విశ్వసనీయ స్నేహితులలో ఒకరు. మాజీ న్యాయవాది అయిన లెబ్లాంక్ 20 సంవత్సరాలకు పైగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. లెబ్లాంక్ మొదటిసారిగా 2000లో ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2008లో పోటీ చేశాడు కానీ మైఖేల్ ఇగ్నాటీఫ్ చేతిలో ఓడిపోయాడు. తర్వాత మళ్లీ పోటీ చేయలేదు.
మార్క్ కార్నీ
మార్క్ కార్నీ బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు కూడా నాయకత్వం వహించారు. అంతకుముందు, ట్రూడో తన జట్టులో మార్క్ ఉండాలని కోరుకున్నాడు. బీబీసీ ప్రకారం, కార్నీ ఇటీవలి నెలల్లో ట్రూడోకు ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నారు.
మెలానీ జోలీ
మెలానీ జోలీ 2021 నుండి దేశ దౌత్యవేత్తగా ఉన్నారు. ప్రస్తుతం కెనడా విదేశాంగ మంత్రిగా ఉక్రెయిన్‌కు ఆమె అనేక మార్లు పర్యటనలు చేశారు. కెనడా ఇండో-పసిఫిక్ వ్యూహానికి కూడా ఆమె నాయకత్వం వహించారు.
అనితా ఆనంద్
అనితా ఆనంద్ 2021లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన ఆమె ఫినాన్షియల్ మార్కెట్ రెగ్యులేషన్, కార్పొరేట్ గవర్నెన్స్‌లోనూ భాగమయ్యారు.
పియర్ పోయిలీవ్రే
పోయిలీవ్రే 2022 నుండి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, 2004 నుండి పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నాడు. లిబరల్స్ ఓడిపోతే, పియర్ ప్రధానమంత్రి పదవికి ముందంజలో ఉంటాడు. ఈ లెక్కన ఆయనే ప్రధాని అవుతాడని పలువురు భావిస్తున్నారు.
మరోపక్క ఇటీవలే కెనడా ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ట్రూడో కేబినేట్ లో అత్యంత శక్తివంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రధాని ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ట్రూడో దాదాపు దశాబ్ద కాలంపాటు ప్రధానిగా కొనసాగారు. రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఇన్నాళ్లూ ఎలాగోలా నెట్టుకొచ్చారు. రాజీనామా చేయాల్సిందేనని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్ పెరుగుతుండడంతో ట్రూడో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : Stock Market Crash: స్టాక్ మార్కెట్లలో HMPV కేస్ భయం - సెన్సెక్స్ 1200, నిఫ్టీ 400 పాయింట్లు క్రాష్