అన్వేషించండి

Telegram CEO Pavel Durov: టెలిగ్రామ్ సీఈవో పావేలు దురోవ్‌ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

Pavel Durov: టెలిగ్రామ్ సీఈవో పావేల్ దురోవ్‌ పారిస్‌లో అరెస్ట్ అయ్యాడు. యాప్‌లో డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Pavel Durov Arrested: బిలియనీర్, టెలిగ్రామ్ సీఈవో పావేల్ దురోవ్‌ని ఫ్రెంచ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పారిస్‌లో ఎయిర్‌పోర్ట్‌ బయటే ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు CNN వెల్లడించింది. టెలిగ్రామ్ యాప్‌లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మనీ లాండరింగ్‌తో పాటు డ్రగ్ ట్రాఫికింగ్ కూడా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. అశ్లీల కంటెంట్‌ పెద్ద ఎత్తున ఈ యాప్‌లో షేర్ అవుతోందన్న ఆరోపణలతో పోలీసులు పావేల్‌ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్ ఫౌండర్ గురించి అంతా గూగుల్ చేస్తున్నారు. ఏం జరిగింది..? బ్యాగ్రౌండ్ ఏంటని ఆరా తీస్తున్నారు. 39 ఏళ్ల పావేల్ దురోవ్ టెలిగ్రామ్ యాప్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. అప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, విచాట్‌ అందుబాటులో ఉన్నాయి. ఫేమస్ కూడా అయ్యాయి. కానీ..వాటన్నింటికీ దీటుగా టెలిగ్రామ్‌ని పోటీలో నిలబెట్టాడు. వచ్చే ఏడాదికి 100 కోట్ల యూజర్స్‌ని సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకుంది టెలిగ్రామ్. 

రష్యాలో పుట్టి పెరిగిన పావేల్ దురోవ్ 2014లో ఆ దేశం విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అప్పట్లో ఆయన VKontakte పేరిట ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని స్థాపించాడు. అయితే... ప్రభుత్వం అప్పట్లో ఈ యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రూప్‌లు కనిపించకూడదని ఆంక్షలు విధించింది. ఈ డిమాండ్‌లకు తలొగ్గలేక అక్కడి నుంచి వచ్చేశాడు పావేల్ దురోవ్. ఆ తరవాత రష్యాలో టెలిగ్రామ్‌ యాప్‌కీ చిక్కులు ఎదురయ్యాయి. సెక్యూరిటీ, ప్రైవసీ లేదన్న కారణంగా అక్కడ ఆందోళనలు జరిగాయి. అప్పటి నుంచే ఈ యాప్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఎన్‌క్రిప్షన్‌ కూడా సరిగ్గా లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. Forbes ప్రకారం పావేల్ దురోవ్‌ ఆస్తుల విలువ 15.5 బిలియన్ డాలర్లు. అయితే...కొన్నాళ్లుగా ఈ యాప్‌పై విపరీతమైన నిఘా పెరగడం వల్ల ఇబ్బందులు తప్పలేదు. పాపులారిటీతో పాటు అధికారుల నుంచి నిఘా పెరిగింది. డేటా బ్రీచ్ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. 

డ్రగ్ ట్రాఫికింగ్ కూడా జరుగుతోందన్న ఆరోపణలతో ఒక్కసారిగా టెలిగ్రామ్‌ యాప్‌పై అనుమానాలు పెరిగిపోయాయి. Moscow Times వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ యాప్ ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్, పిల్లలపై అత్యాచారాలు, మనీ లాండరింగ్ లాంటి నేరాలు పెరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌లో టెలిగ్రామ్ యాప్‌కి చాలా పాపులారిటీ వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన సమాచారమంతా ఇందులోనే ఎక్కువగా షేర్ అవుతోంది. అందుకే అక్కడి అధికారులు టెలిగ్రామ్‌ని వర్చువల్ బ్యాటిల్ ఫీల్డ్ గా చెబుతున్నారు.  చట్టానికి లోబడి ఈ యాప్ నడుచుకోవడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అందుకే అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు సమాచారం. పైగా ఈ లోపాలపై ఎన్నోసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ వ్యవహారం అరెస్ట్ వరకూ వెళ్లింది. "నాకు ఎవరో ఆర్డర్ వేస్తే నచ్చదు. నాకు నచ్చినట్టు నేనుంటా" అని 2014లో ఓ సందర్భంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు పావేల్ దురోవ్. అతని వైఖరి కూడా టెలిగ్రామ్‌ పతనానికి ఓ కారణంగా చెబుతున్నారు. 

Also Read: Israel: మా జోలికొస్తే తాట తీస్తాం, ఎంతకైనా తెగిస్తాం - హెజ్బుల్లాకి నెతన్యాహు వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget