అన్వేషించండి

Ratan Tata will : మోహిని పేరు మీద వీలునామాలో రూ. 500 కోట్ల ఆస్తి రాసిన రతన్ టాటా - ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో విషయాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. అందులో తాజాగా మోహని మోహన్ దత్తాకు ఐదు వందల కోట్లు రాశారు. ఎవరంటే ?

Who is Mohini Mohan Dutta Rs 500 crore surprise in Ratan Tata  will: దేశంలో దిగ్గజ పారిశ్రామిక వేత్తగా టాటా గ్రూపును శాఖోపశాఖలుగా విస్తరించిన గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా గత ఏడాది చనిపోయారు. ఆయన పెళ్లి చేసుకోలేదు.తన జీవితాన్ని పూర్తిగా టాటా గ్రూపుకే అంకితం చేశారు.ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీలునామాలోఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఆయన మిత్రుడిగా పేరు తెచ్చుకున్న శంతనుకూ.. విద్య కోసం అయిన అప్పులు చెల్లించడమే కాకుండా టాటా గ్రూపులో మంచి ఉద్యోగం వచ్చేలా చేశారు. ఇప్పుడు మోహిని మోహన్ దత్తా అనే వ్యక్తికి ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తిని కేటాయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి ఈ హాట్ టాపిక్ అయింది.అసలు ఎవరు ఈ మోహిని మోహన్ దత్తా అని  సెర్చ్ చేయడం ప్రారంభించారు. 

రతన్ టాటా కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో కలసి పని చేసిన మోహని మోహన్ దత్తా 
 
రతన్ టాటా తన వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ గోప్యత పాటిస్తారు. అందుకే ఆయనపై ఎప్పుడూ వ్యాపార పరమైన అంశాలు తప్ప ఇతర విషయాల్లో రూమర్స్ రావు. అందుకే ఈ మోహిని మోహన్ దత్తా ఎవరో ఎవరికీ పెద్దగా తెలియదు. ఈయన రతన్ టాటాకు మిత్రుడని కూడా ఎప్పుడూ పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ రతన్ చాటా .. తన వ్యాపార  పయనం ప్రారంభించిన కొత్తలో మోహిని మోహన్ దత్తాతో కలిసి పని చేశారు. ఆ సమయంలో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. మోహిని మోహన్ దత్తా కూడా మొదట టాటా గ్రూపులో ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. తర్వాత సొంతంగా ట్రావెల్ ఎజెన్సీని పెట్టారు .

Also Read: ముఖానికి కవర్ చుట్టి నైట్రోజన్ గ్యాస్ పంపి చంపేశారు - హత్య కాదు ఉరిశిక్ష- అమెరికాలో అంతే !

ట్రావెల్స్ ఎజెన్సీ సక్సెస్ కావడంతో ఆ సంస్థను టాటా హోటల్ గ్రూపు విభాగమైన తాజ్  గ్రూపు విలీనం చేసుకుంది. తర్వాత థామస్ కుక్ ఇండియా గ్రూపనకు అమ్మేసింది. అయితే ఆ సమయంలో టాటా షేర్ హోల్డర్ గా మారిన మోహిన్ మోహన్ దత్తా.. టాటా క్యాపిటల్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాటా క్యాపిటల్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. రతన్ టాటాతో తన అనుబంధం.. ఆయనకు ఇరవై నాలుగు ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఉందని మోహని మోహన్ దత్తా గుర్తు చేసుకున్నారు. గుజరాత్ కు చెందిన ఆయన ఇప్పటికీ టాటా గ్రూపులో విధులు నిర్వహిస్తున్నారు.      

మోహిని మోహన్ దత్తా కుమార్తె కూడా టాటా గ్రూపులో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆమె పని తీరు కూడా రతన్ టాటాను ఎంతో ఆకట్టుకుంది. ఆమెకు మంచి భవిష్యత్ ఉందని చెప్పేవారని అంటున్నారు. 

Also Read: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Arrest: తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు! త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై కేసులు
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget