అన్వేషించండి

Basavaraj Bommai Bio: కర్ణాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై గురించి ఈ విషయాలు తెలుసా?

కర్ణాటక కొత్త సీఎం బసవరాజ బొమ్మై నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన తండ్రి కూడా ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు..

కన్నడనాట రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ భాజపా శాసనసభాపక్షం సమావేశం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బి.ఎస్‌.యడియూరప్ప తర్వాత ముఖ్యమంత్రి పదవికి తాజా మాజీ హోంమంత్రి బసవరాజ బొమ్మై పేరును ప్రతిపాదించింది. కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న బొమ్మై తండ్రి సోమప్ప రాచప్ప బొమ్మై (ఎస్‌.ఆర్‌.బొమ్మై) కూడా గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  ఆయన సోషలిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు.

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం నిర్వహించిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా వచ్చిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన బసవరాజ బొమ్మై పేరు వెల్లడించారు. ఆపై మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు తరలివెళ్లిన బసవరాజ.. సర్కారు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కోరారు. బుధవారం ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్రప్రధాన్‌, భాజపా నాయకురాలు డీకే అరుణ, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యడియూరప్ప వల్లే..

బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదించారు. తన పేరు ప్రకటించగానే బసవరాజ స్పందించి.. యడియూరప్ప పాదాలకు నమస్కరించారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు. బసవరాజతో పాటు ఆ ముగ్గురూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో గోవింద కారజోళ యడియూరప్ప సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఆ కారణంగానే..

నూతన ముఖ్యమంత్రి నియామకంలో యడియూరప్ప సూచనలను భాజపా ఆమోదించింది. పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజకు అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది. ఇప్పటికే వందలాది లింగాయత్‌ మఠాధిపతులు లింగాయేతర సముదాయం నుంచి నూతన సీఎంను ఎంపిక చేయరాదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. భాజపా సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది.

మాజీ ముఖ్యమంత్రి కుమారుడే..

  1. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడు.
  2. 1988- 1989లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కర్ణాటక సీఎంగా పనిచేశారు.
  3. 1960 జనవరి 1న హుబ్బళ్లిలో జన్మించిన బసవరాజ కొన్నాళ్లు జేడీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, 1996 నుంచి 1997 వరకు నాటి ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు.
  4. 2005 వరకు రెండుసార్లు విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. 2006లో భాజపాలోకి చేరిన ఆయన హావేరి జిల్లా శిగ్గాం ఉంచి వరుసగా మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. 
  5. 61 ఏళ్ల బసవరాజ బసవరాజ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. పుణె టెల్కో కంపెనీలో సాంకేతిక సలహాదారుడిగా, సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నీటిపారుదల రంగంలో విశేష పరిజ్ఞానం ఉంది.
  6. 2008లో తొలిసారి విధానసభకు ఎన్నికైన ఆయన.. అదే ఏట ఏర్పాటైన భాజపా సర్కారులో జల వనరులు, 2019లో మళ్లీ ఏర్పాటైన సర్కారులో సహకార, హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget