Today Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు.. ఆ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచన..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. కోల్‌కత్తాకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపాయి.
బంగాళాఖాతంలో కోల్‌కత్తాకు సమీపంలో అల్ప పీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ద్రోణి ఉత్తర తెలంగాణ వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో పాటు ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సగటు సముద్రమట్టం కంటే 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో పలు జిల్లాల వారికి అలర్ట్..
ఉత్తర తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో నేడు (సెప్టెంబర్ 21), రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు (మంగళవారం), రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రాలో ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లుండి (గురువారం) ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమలో మరో మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో ఈ జిల్లాల వారికి అలెర్ట్..
తెలంగాణలో ఇవాళ (సెప్టెంబర్ 21) పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు (బుధవారం) ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జనగాం, యాదాద్రి, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నల్లగొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, కుమ్రం భీమ్, హైదరాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! దిగొచ్చిన పసిడి ధర, స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇవి..
Also Read: Horoscope Today : ఈ రాశుల ఉద్యోగస్తులకు ఈ రోజంతా శుభసమయమే, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..