By: ABP Desam | Updated at : 07 Jan 2023 07:28 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Weather Latest Update: ఇన్ని రోజులు చలి లేదు లేదు అనుకున్నారు అంతా. కానీ ఇవాళ్టి నుంచి తన ప్రభావం ఏంటో చలి చూపించనుంది. గతంలో ఎప్పుడూ చూడని చలిని ఈసారి చూస్తారని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో అక్కడ ఉంటే పొడి వాతావరణం దక్షిణ భారత్‌వైపు ట్రావెల్ చేయనుంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోనుందని. అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం చాలా ఉంది.
ఉత్తరభారత దేశాన్ని వణికిస్తున్న చలి తీవ్రత తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుంది. అక్కడ ఉన్న పొడి వాతావరణం మనవైపు రానుంది. దీని వల్ల వాతావరణంలో చాలా మార్పులు గమనించవచ్చు. తెలంగాణలో అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంంది. రాయసీమలోని దక్షిణ భాగంలో కూడా మేఘావృతమై ఉంటుంది. బంగాళాఖాతంలో దక్షిణ భాగాల్లో కూడా చల్లటి వాతావరణ ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా పడొచ్చు.
తెలంగాణలో ఇప్పుడు ఉన్న తేమ క్రమంగా దిగువకు వెళ్లిపోతోంది. బెంగళూరుపై ఉన్న మేఘాలు మరింత కిందికి వెళ్లిపోతున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలో ఏర్పడిన మేఘాలు దక్షిణ ఆంధ్రప్రాంతవైపు వస్తాయి. రానున్న రోజులు ముఖ్యంగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 6, 2023
ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చలి వణికించనుంది. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్ర ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉంది.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో నిన్నటి(శుక్రవారం) నుంచే చలి తీవ్రత మొదలైపోయింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, కొమ్రంభీం, భద్రాద్రి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో చలి వణికించబోతోంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 6, 2023
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి భయంకరంగా ఉండబోతోంది. అక్కడ దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకు ఛాన్స్ ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు తప్ప ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తన ప్రతాపాన్ని చూపబోతోంది. ఆ రెండు జిల్లాల్లో విశాఖ మీదుగా ఏర్పడిన మేఘాల కారణంగా వర్షపు జల్లులు పడబోతున్నాయి. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు ఛాన్స్ ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 6, 2023
Petrol-Diesel Price 05 February 2023: రాజమండ్రిలో చమురు మంట, పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్ బంక్‌కు వెళ్లండి
ABP Desam Top 10, 5 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KNRUHS: యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ఆప్షన్లు!
Gold-Silver Price 05 February 2023: కుప్పకూలిన బంగారం, వెండి రేట్లు - కొనాలనుకునే వాళ్లకు మంచి అవకాశం
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?