చలికాలమే కానీ ఉక్క పోస్తుంది- కోస్తా ప్రాంతాల్లో చిరు జల్లులు పడే అవకాశం!
కొండ ప్రాంతాలైన అరకు లోయ, అల్లూరిసీతారామరాజు జిల్లా, విజయనగరం-ఒడిశా బార్డర్ ప్రాంతాలల్లో చల్లటి వాతావరణం 12 డిగ్రీల వరకు ఉండనుంది.
తెలుగు రాష్టాల్లో చలి తీవ్రత కొనసాగనుంది. కానీ సాధారణం కాంటే తక్కువ చలి మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. సముద్రం నుంచి తేమ గాలులు నేరుగా భూమిలోకి రావడం వలన వెచ్చగా, కొంచం వేడి వాతావరణంగా ఉంటుంది. ఇలా జరగడం గతంలో చాలా సార్లు చూశాం. 2018 చలి కాలం ఇలా సాగింది. 2019 నుంచి 2022 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్లీ వేడిగా మారింది.
కొండ ప్రాంతాలైన అరకు లోయ, అల్లూరిసీతారామరాజు జిల్లా, విజయనగరం-ఒడిశా బార్డర్ ప్రాంతాలల్లో చల్లటి వాతావరణం 12 డిగ్రీల వరకు ఉండనుంది. రాయలసీమ - కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో చలి ఉన్నా అంతగా ఉండదు. కోస్తా ప్రాంతాల్లో ఉక్కగా ఉంటుంది. తెల్లవారిజామున అక్కడక్కడ కోస్తా భాగాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. విజయనగరం టౌన్ పరిసరాల్లో, అనకాపల్లి జిల్లాల్లోని పలు భాగాల్లో చిరు జల్లులు కురిశాయి. వైజాగ్ నగరం పశ్చిమ భాగాల్లో కూడా చిన్నపాటి వర్షాలు పడ్డాయి.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో వాతావరణం పొడిగానే ఉంటుంది. హైదరాబాద్‌లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పొగమంచు ఇబ్బంది పెడుతుంది. ఉదయం టైంలో ఏర్పడే ఆ పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో గరిష్ట కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ లేదా తూర్పు దిశల నుంచి వీచే కారులు కారణంగా కాస్త చలి వాతావరణం ఉంటుంది. ఈ గాలి వేగం గంటకు మూడు నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది.
నిన్న నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత- 30.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత- 20.4 డిగ్రీలు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) January 2, 2023