Weather Latest Update: తెలంగాణ మీదుగా బలహీనపడ్డ ద్రోణి, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా - ఐఎండీ
Weather News Latest: ఈ రోజు తెలంగాణలో కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయం దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు.
Weather Latest News: నిన్న దక్షిణ అంతర్గత కర్నాటక, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా దక్షిణ కోస్తా వరకు సముద్ర మట్టానికి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి, ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయం దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.9 డిగ్రీలుగా నమోదైంది. 65 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: నిన్నటి దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో గుర్తించినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ ఉపరితల ఆవర్తనం నుంచి ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ ఒడిశా తీరానికి తెలంగాణ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో తక్కువగా గుర్తించినట్లుగా వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్యం, తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.