Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్- బయటకి వస్తే భస్మమే
Weather Report: సూరీడు పగబట్టేశాడు. ప్రకృతి రక్షించాల్సింది పోయి విధ్వంసం చేస్తారా అన్నట్టు కన్నెర్ర చేస్తున్నాడు. జనాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు.
Weather Latest News: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి పూట ఎండలు మండిపోతుంటే రాత్రివేళలో ఉక్కపోత నిద్రపోనివ్వడం లేదు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మాత్రం నాలుగు రోజుల తర్వాత తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు చెబుతోంది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40ప్లస్ నమోదు అవుతున్నాయి. ఏ జిల్లా ఉష్ణోగ్రతలు చూసుకున్నా తగ్గేదేలే అన్నట్టు పెరిగిపోతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో 44 డిగ్రీలకుపైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని... నీడ ప్రాంతాల్లో, గాలి తగిలే ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తోంది. ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలని చెబుతోంది.
తెలంగాణలో ఇవాళ వడగాలులు వీచే ప్రాంతాలు:- నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్
రేపు(శుక్రవారం) తీవ్రమైన వడగాలులు వీచే ఉండే ప్రాంతాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి
రేపు(శుక్రవారం) సాధeరణ వడగాలులు వీచే ప్రాంతాలు:- నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల్
మూడో తేదీ నుంచి నాల్గో తేదీ ఉదయం వరకు తీవ్రమైన వడగాలులు వీచే ప్రాంతాలు:- నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
మూడో తేదీ నుంచి నాల్గో తేదీ ఉదయం వరకు సాధారణ వడగాలులు వీచే జిల్లాలు:- ఆదిలాబాద్, కోమరం భీమ్, ఆసిపాబాద్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, కామారెడ్డి,
నాల్గో తేదీ నుంచి ఐదో తేదీ ఉదయం వరకు తీవ్ర వడగాలుల వీచే ప్రాంతాలు:- ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్
నాల్గో తేదీ నుంచి ఐదో తేదీ ఉదయం వరకు సాధారణ వడగాలులు వీచే ప్రాంతాలు:- కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొంండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్,
ఐదో తేదీ తర్వాత తెలంగాణ వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. ఐదో తేదీ సాయంత్రం నుంచి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగాలులు ప్రభావం తప్పకపోవచ్చు. ఆరు నుంచి 8 వరకు తేలికపాటు వర్షాలు కురిచే అవకాశం
రాబోయే నాలుగు రోజులు వివిధ ప్రాంతాల్లో నమోద కాబోయే ఉష్ణోగ్రతుల చూస్తే.... ఇవాళ అన్ని జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదు అవుతాయి. మూడో తేదీన జగిత్యాల, జయశంకర్, కరీంనగర్, ఖమ్మం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. నాల్గో తేదీ నాడు భద్రాచలం కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపలపల్లి, కరీంనగర్, ఖమ్మం ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఐదో తేదీ ఆదిలాబాద్, కొమరం భీమ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ తర్వాత వాతావరణం కాస్త చల్లబడొచ్చని వాతావరణ శాఖ అంచా వేస్తోంది.
Hyderabad Weather: హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉంటుందంటే?
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయవ్య దిశ నుంచి వీస్తాయి. బుధవారం 42.8 డిగ్రీల గరిష్ఠ, 29.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రత ఎలా ఉందంటే?
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్, మరికొన్ని జ్లాలలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. వడగాలులు ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెండు రోజుల పాటు అక్కడ 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు ఇచ్చింది. ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.