ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు వర్షాలకు ఛాన్స్- తెలంగాణలో వణికిస్తున్న చలి
నవంబర్ 18న అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 17, 2022 ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి క్రమంగా దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ప్రభావం చూపనుంది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది.
వర్షపాతం
నవంబర్ 18న అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 20న ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 21న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్ మీదుగా చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 22న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కొన్ని ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
గాలి హెచ్చరిక:
అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా 40-45 కి.మీ వేగంతో 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 19న నైరుతి, ఆగ్నేయ & పశ్చిమ మధ్య బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి, వెలుపలి ప్రాంతాలలో 45-55 kmph నుంచి 65 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 20వ తేదీన నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరాల వెంబడి 45-55 kmph నుంచి 65 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
సముద్ర పరిస్థితి
అండమాన్ సముద్రం, నైరుతి, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. నవంబర్ 19న నైరుతి, ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వెంబడి సముద్రం ఉద్ధృతంగా ఉంటుంది.
మత్స్యకారుల హెచ్చరిక
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ సూచించింది.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ చలిగాలులు మాత్రం వణికించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ రాత్రి వేళ, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో గరిష్ణ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రత 13.6 డిగ్రీలుగా నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.4 డిగ్రీలు నమోదైతే.... తక్కువ మెదక్‌లో 11 డిగ్రీలు రిజిస్టర్ అయింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 17, 2022
— IMD_Metcentrehyd (@metcentrehyd) November 17, 2022