Watch Video: నాన్నా మందు కావాలంటూ వెక్కివెక్కి ఏడ్చిన బుడ్డోడు, అవాక్కైన తండ్రి - వీడియో వైరల్
Watch Video: మందు కావాలంటూ ఓ చిన్నారి గుక్క పట్టి ఏడుస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
పాలు తాగే వయసులో ఏంటిది..?
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. కాస్త ఫన్నీ కంటెంట్ ఉంటే చాలు. అలా షేర్ చేస్తూనే ఉంటారు. అందరూ స్టేటస్‌లో పెట్టి ఫేమస్ చేసేస్తారు. ముఖ్యంగా చిన్నారుల వీడియోలైతే చాలా తొందరగా వైరల్ అయిపోతాయి. ముద్దు ముద్దు మాటలు, వాళ్లు చేసే అల్లరి అందరికీ నచ్చేస్తుంది. కొందరు పిల్లలు మంకుపట్టు పట్టి ఏదోటి కావాలని అంటుంటారు. ఏడుస్తుంటారు. ఈ వీడియోలూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతాయి. ఇప్పుడలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులోనూ ఓ పిల్లాడు మొండి పట్టు పట్టి ఏడుస్తున్నాడు. చూస్తుంటే ఐదేళ్లు కూడా ఉంటాయో లేదో అనిపిస్తోంది కానీ...వాడు ఎందుకోసం ఏడుస్తున్నాడో తెలిస్తే "మహా ముదురు" అని బిరుదు ఇచ్చేస్తారంతా. వాళ్ల నాన్నను బొమ్మ కావాలనో, సినిమాకు తీసుకెళ్లాలనో ఏడవలేదు ఈ బుడ్డోడు. వీడికి మందు కావాలంట. అవును మీరు చదివింది నిజమే. "నాకు మందు కావాలి"అని గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఇది చూసి వాళ్ల నాన్న షాక్ అయ్యాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. పాలు తాగే వయసులో మందు కావాలంటూ ఈ బుడ్డోడు ఏడ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడి ఇన్నోసెన్స్‌ని చూసి నవ్వుకోవాలో... కోప్పడాలో అర్థం కాలేదు ఆ తండ్రికి. ఇప్పటికే ఈ వీడియోకి వేలాది వ్యూస్ వచ్చాయి. "ఇది మరీ అతిరా బాబు" అంటూ కొందరునెటిజన్లు కామెంట్‌లు కూడా చేస్తున్నారు.
थोड़ी सी दारू पीना है 🤣🍷🥂 pic.twitter.com/GSgfsMTv58
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 1, 2022
లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారులు..
ఘజియాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయి అరగంట పాటు నరకం అనుభవించారు. ఈ ముగ్గురూ 10 ఏళ్ల లోపు బాలికలే. 20 వ అంతస్తు నుంచి కిందకు వస్తుండగా...11 వ అంతస్తు వద్ద ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్‌లోని సీసీటీవీలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముగ్గురు చిన్నారులు భయంతో వణికిపోతూ కనిపించారు. గట్టిగా అరుస్తూ ఏడ్చారు. ఒకరిని ఒకరు ఓదార్చు కున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడ్చి ఊరుకోకుండా...లిఫ్ట్ గేట్ తీసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దాదాపు అరగంట పాటు అలా లిఫ్ట్‌లో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తరవాత అపార్ట్‌మెంట్ వాసులు వచ్చి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఓ చిన్నారి తండ్రి మెయింటేనెన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు.
Three little girls stuck in a society lift in Crossings Republik, Ghaziabad, for 30 minutes. pic.twitter.com/5lYd0sQTh2
— Sandeep Shrivastwa (@SandeepAndes) December 1, 2022
Also Read: Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!