Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!
Bhopal viral video: ఆహ్వానం లేకుండా పెళ్లికి వచ్చి ఉచితంగా భోజనం చేశాడని ఓ విద్యార్థితో అంట్లు తోమిచ్చారు.
Bhopal viral video: పెళ్లిలో పాత్రలు కడగమని ఓ వ్యక్తిని బలవంతం చేసిన వీడియో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఓ వివాహ కార్యక్రమంలో ఈ వీడియో రికార్డ్ చేశారు. ఎంబీఏ విద్యార్థి అయిన వ్యక్తి వివాహ వేడుకలో అన్నం తిన్నాడని వారు ఈ పని చేశారు.
ఇదీ జరిగింది
జబల్‌పుర్ నగరానికి చెందిన ఓ విద్యార్థి భోపాల్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. ఆ విద్యార్థి పిలవని పెళ్లి విందుకు వచ్చి ఉచితంగా భోజనం చేశాడు. ఇది చూసి పట్టుకున్న పెళ్లి వారు ఇందుకు శిక్షగా అతనితో బలవంతంగా గిన్నెలు కడిగించారు.
What a shameful incident. No amount of money can bring class. 🤮🤮🤮🤮 || MBA student gatecrashes a wedding in Bhopal, forced to wash dishes after being caught. https://t.co/Eixx9StJkn
— Deepak Karamungikar (@doublemasaala) December 2, 2022
వైరల్
It's not a Crime if someone (Educated/Uneducated) have eaten food in any marriage function without invitation. It's under article 32 of Constitution of India. Person (who have Forced MBA Student to Clean & Wash DISHES as punishment)MUST be ARRESTED for using FORCE & Making VIDEO. https://t.co/0jUX24fKQ7
— SUNIL PAREEK (@pareekindia) December 1, 2022
ఇలా ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించి ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్లేట్లు కడిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అని ఆ వ్యక్తి ఎంబీఏ విద్యార్థిని అడిగాడు. "ఉచితంగా ఆహారం తిన్నాను. ఏదో ఒకటి చేయాలి" అని ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి విందులో విద్యార్థులు తినడం సర్వసాధారణమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. విద్యార్థితో గిన్నెలు కడిగించి అవమానపర్చడం చాలా తప్పు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: GetOutRavi hashtag: ట్రెండింగ్‌లో GetOutRavi హ్యాష్ ట్యాగ్- తమిళనాడు గవర్నర్ ఏం చేశారు?