ధగధగ మెరిసిపోతున్న అయోధ్య ఆలయం, ఎంత అందంగా అలంకరించారో చూడండి
Ram Mandir Inauguration: ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్య రామ మందిరాన్ని అందంగా అలంకరించారు.
Ramlala Pran Pratishtha: అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు నెల రోజులుగా అయోధ్యలో ఈ సందడి మొదలైంది. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులను శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. అటు ఆలయాన్నీ అందంగా ముస్తాబు చేశారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విద్యుత్ లైట్‌ల కాంతుల్లో ఆలయం కనువిందు చేస్తోంది. మార్బుల్స్ తళతళ మెరిసిపోతున్నాయి. స్తంభాలను పూలతో అలంకరించారు. పైకప్పు నుంచి రకరకాల పూల దండల్ని వేలాడ దీస్తున్నారు. వాటిని అందంగా అల్లుతున్నారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయాన్ని అలంకరిస్తున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12.30 నిముషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జనవరి 16 నుంచే పలు పూజా క్రతువులు కొనసాగుతున్నాయి. బాల రాముడి విగ్రహాన్ని గర్భ గుడిలోకి తీసుకొచ్చారు. లక్ష్మీ కాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. 51 ఇంచుల ఈ విగ్రహాన్ని కృష్ణ శిలతో తయారు చేశారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ దీన్ని చెక్కారు. ఐదేళ్ల రాముడి విగ్రహం ఎత్తు 5 అడుగులు.
#DDNews Exclusive sneak peek inside the magnificent Ram Temple!
— DD News (@DDNewslive) January 20, 2024
The craftsmanship is awe-inspiring, a testament to India's rich cultural heritage. @PMOIndia @ShriRamTeerth @UPGovt @tourismgoi @MinOfCultureGoI @tapasjournalist#Ayodhya #AyodhyaRamTemple #RamTemple… pic.twitter.com/FyaMm4FGrv
"జైశ్రీరామ్" ఆకారంలో పూలను అలంకరించడం ఆకట్టుకుంటోంది. గర్భాలయంపైనా పూలతో అలంకరిస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: Latest visuals from Ayodhya's Ram Temple where preparations are in full swing for the Pran Pratishtha ceremony on January 22. pic.twitter.com/CSxUwYnPFc
— ANI (@ANI) January 20, 2024