Watch Video: పేపర్ చదువుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి- వైరల్ వీడియో!
Watch Video: ఓ వ్యక్తి పేపర్ చదువుతూ కుప్పకూలిపోయి మరణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch Video: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరూ చెప్పలేరు. ఎంతో ఆరోగ్యంగా ఉండే మనుషులు కూడా ఒకేసారి కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో పేపర్ చదువుతూ ఉన్నట్టుండి కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
రాజస్థాన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. బార్మర్‌కు చెందిన వ్యాపారవేత్త దిలీప్ కుమార్ మదానీ.. పంటి నొప్పి కారణంగా శనివారం స్థానికంగా ఉన్న ఒక పళ్ల డాక్టర్ వద్దకు వెళ్లారు. ఆ క్లినిక్ రిసెప్షన్ వద్ద కూర్చొని అక్కడున్న వార్తా పత్రిక చదువుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఒక పక్కకు ఒరిగిన ఆయన కిందపడ్డారు.
इस तरह की घटनाएं चिंता बढाने वाली है। पचपदरा (बाड़मेर) निवासी दिलीप जी जैन अचानक अखबार पढ़ते पढ़ते चल बसे।
— Vivek Shrivastava (@Viveksbarmeri) November 6, 2022
कोरोना के बाद लगातार ऐसी घटनाएं बढ़ रही है।#Rajasthan pic.twitter.com/SoUNn4D4mV
ఇది గమనించిన ఆ క్లినిక్ సిబ్బంది వెంటనే దిలీప్ కుమార్‌కు సహాయం చేసేందుకు పరుగున వచ్చారు. ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యాపారవేత్త అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ పంటి ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.