By: Ram Manohar | Updated at : 08 May 2023 04:38 PM (IST)
బిహార్‌లో ఓ మురికి కాల్వలో కరెన్సీ నోట్లు కనిపించగా గ్రామస్థులు గుమిగూడి ఏరుకున్నారు. (Image Credits: Twitter)
Viral Video:
కాలువలో నోట్ల కట్టలు
బిహార్‌లోని ససరం ప్రాంతానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు కాలువలో కరెన్సీ నోట్లు ఏరుకుంటూ వాటిని బయటకు తీస్తున్నారు. మోరాదాబాద్ ఏరియాలో ఉన్న ఓ కాలువలోకి కొంత మంది దిగారు. కట్టలు కట్టలు కరెన్సీ నోట్లు తీసుకుని బయటకు వస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 20 మంది ఆ కాలువలో ఉన్నారు. ఓ వృద్ధుడైతే రెండు చేతుల్లో నోట్లు తీసుకుని మురిసిపోయాడు. పరిగెత్తుకుంటూ నీళ్లలో నుంచి వచ్చేశాడు. రూ.100,రూ.200, రూ.500,రూ.2000 నోట్లు దొరికినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే...అక్కడ నోట్ల కట్టలు ఎలా వచ్చాయన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. ఎక్కడి నుంచి ఈ నోట్లు వచ్చాయనేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. అక్కడి గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం...తెల్లవారుజామున కరెన్సీ నోట్ల కట్టలున్న బస్తాలు నీళ్లలో కనిపించాయి. ఇది చూసి ఒక్కసారిగా జనాలు అక్కడ గుమిగూడారు. మురికి నీళ్లు అని కూడా చూడకుండా లోపలికి వెళ్లిపోయి వాటిని ఒడిసి పట్టుకున్నారు. ఇవి నకిలీ నోట్లు అని కొంత మంది కొట్టి పారేసినా...గ్రామస్థులు మాత్రం అవి నకిలీ నోట్లు కాదని తేల్చి చెప్పారు. నకిలీ నోట్లు కూడా కానప్పుడు అంత డబ్బుని కాలువలో ఎందుకు పారేశారన్నది తేలాల్సి ఉంది.
If it is money, people will do anything. They waded sewage water in a canal in #Sasaram town in #Rohtas district of #Bihar to collect bundles of sodden, rotten currency notes. #India #Rupees #MoneyHeist pic.twitter.com/0NCCCHKf7u
— Dev Raj (@JournoDevRaj) May 6, 2023
గతంలోనూ ఓ వీడియో వైరల్..
సోషల్ మీడియా. ఇప్పుడిదే అందరి ప్రపంచం. జస్ట్ అలా ఫేస్బుక్, ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు. బోలెడంత కంటెంట్. వీడియోలైతే చెప్పనవసరం లేదు. స్క్రోల్ చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతాయి. మొన్నా మధ్య బెంగళూరులో ఓ వ్యక్తి బ్రిడ్జ్ పై నుంచి నోట్ల వర్షం కురిపించిన వీడియో చాలా రోజుల పాటు వైరల్ అయింది. తరవాత మళ్లీ అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గుజరాత్‌లోని మెషనా జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ తన ఇంటి డాబాపై నుంచి నోట్ల వర్షం కురిపించాడు. ఎన్ని లక్షలు అలా పై నుంచి నోట్లు విసురుతూనే ఉన్నాడు. తన మేనల్లుడికి పెళ్లి జరుగుతోందన్న సంతోషంలో ఇలా చేశాడు. కెర్రీ తహసీల్‌లోని అగోల్ గ్రామంలో తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ ఊరేగింపు నిర్వహించాడు. ఆ సమంలోనే బిల్డింగ్‌పై నిలబడి రూ.500 విలువైన నోట్లను ప్రజలపై విసిరాడు. దాదాపు రూ.5 లక్షలు ఇలా విసిరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయింది. జోధా అక్బర్‌లోని అజీమ్ ఓ షాన్ షెహన్షా అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది. పైన నిలబడి ఆ వ్యక్తి పూలు జల్లినంత సింపుల్‌గా నోట్లు చల్లుతూ కనిపించాడు.
Gujarat के मेहसाणा जिले में पूर्व सरपंच के भतीजे की शादी में लाखों रुपए हवा में उड़ा दिए गए।
— Shubhankar Mishra (@shubhankrmishra) February 18, 2023
- 100 और 500 के उड़ाए गए नोट।
- वीडियो सोशल मीडिया पर तेजी से Viral हो रहा है। pic.twitter.com/JG6CKFJ38C
FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
Odisha Train Accident: రైల్వేలో 3 లక్షలకు పైగా పోస్ట్‌లు ఖాళీ, ప్రమాదాలకు ఇదీ ఓ కారణమే!
Odisha Train Accident: రైలు ప్రమాదానికి అసలు కారణం తెలిసింది, వివరాలు ఏంటో చెప్పిన రైల్వే మంత్రి
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?
Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ