Viral Video: కారు కింద దూరిన 15 అడుగుల కోబ్రా,ఎలా బయటకు తీశారో చూడండి - వైరల్ వీడియో
Viral Video: కారు కింద దూరిన 15 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అడవిలోకి వదిలారు.
Viral Video:
15 అడుగుల కోబ్రా
పాములు ఎప్పుడు ఎక్కడ దూరతాయో తెలీదు. మనం చాలా క్యాజువల్‌గా పని చేసుకుంటుంటే సడెన్‌గా కనిపిస్తాయి. బైక్‌లు, కార్లలో దూరి హడలెత్తించిన ఘటనలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగింది. ఓ 15 అడుగుల కోబ్రా కార్ కిందకు దూరింది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల వెచ్చదనం కోసం కార్ కిందకు వెళ్లింది. కార్ ఓనర్ ఇది చూసి జడుసుకున్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌ని పిలిచాడు. ఆ వ్యక్తి చాలా కష్టపడి మొత్తానికి దాన్ని సురక్షితంగా బయటకు తీశాడు. మళ్లీ అడవిలోకి వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కింగ్ కోబ్రాను పట్టుకోవడం అంటే మాటలు కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయ్. అయినా చాలా ధైర్యంగా చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోని షేర్ చేశారు. 15 అడుగుల కోబ్రాను కాపాడినట్టు ట్వీట్ చేశారు.
"నేచర్ బ్యాలెన్సింగ్‌లో కీలకమైన కింగ్ కోబ్రాలను కాపాడుకోవటం మన బాధ్యత. అందుకే కార్ కింద దూరిన 15 అడుగుల కోబ్రాను సేఫ్‌గా బయటకు తీశాం. పాములు పట్టుకోవడంలో ఎక్స్‌పర్ట్ అయిన వ్యక్తినే పంపించాం. ఇలాంటి సాహసాలు మాత్రం మీరు చేయకండి. వర్షాలు పడినప్పుడు వెచ్చదనం కోసం ఇలా ఎక్కడపడితే అక్కడ తల దాచుకుంటాయి"
- సుశాంత నంద, ఫారెస్ట్ ఆఫీసర్
ముందు అది తప్పించుకోకుండా జాగ్రత్తగా పట్టుకున్నాడు. అలా మెల్లగా అటూ ఇటూ తిప్పుతూ ఓ సంచివైపు దాన్ని తీసుకెళ్లాడు. వెంటనే అది అందులోకి వెళ్లిపోయింది. ఆ తరవాత దాన్ని అడవిలోకి వదిలాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని తెగ పొగిడేస్తున్నారు. ఏ మాత్రం భయం లేకుండా అలా ఎలా పట్టుకున్నాడో అంటూ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra’s are vital in the food chain for maintaining balance in nature. Here is one nearly 15 feet long rescued & released in the wild.
— Susanta Nanda (@susantananda3) May 4, 2023
Entire operation is by trained snake catchers. Please don’t try on your own. With onset of rains, they can be found in all odd places. pic.twitter.com/g0HwMEJwp2
గతంలో కర్ణాటకలోని మైసూరులోనూ ఇదే జరిగింది. వెచ్చగా ఉందనకుందేమో..ఓ కోబ్రా షూలో దాక్కుంది. పాములు పట్టుకునే వ్యక్తి వచ్చి దాన్ని బయటకు తీసేందుకు చాలానే కష్టపడ్డాడు. స్నేక్ హుక్తో షూని అలా టచ్ చేశాడో లేదో..వెంటనే పడగ విప్పి బుస కొట్టింది కోబ్రా. ట్విటర్లో ఈ వీడియో పోస్ట్ చేయగా...వైరల్ అయింది. షూ వేసుకునేందుకు చూసిన వ్యక్తి...లోపల పాముని చూసి షాక్ అయ్యాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ వ్యక్తి వచ్చి షూలో నుంచి పాముని బయటకు తీశాడు. ఇలా షూలో పాము దాక్కుని అందరినీ హడలెత్తించటం ఇదే తొలిసారి కాదు. తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
— Susanta Nanda (@susantananda3) July 11, 2022
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS
Also Read: Karnataka Assembly Elections 2023: ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర, సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ - కాల్ రికార్డింగ్ విడుదల