Vladimir Putin Girlfriend: పుతిన్‌తో అంత చనువుగా ఉన్న ఆ మహిళ ఎవరు? ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారా?
Vladimir Putin Girlfriend: పుతిన్‌తో పాటు చనువుగా ఉంటున్న మహిళ ఎవరు అంటూ అంతా ఆరా తీస్తున్నారు.
Vladimir Putin Girlfriend:
మిస్టీరియస్ విమెన్..
కొత్త ఏడాది వేడుకల్లో రష్యా అధ్యక్షుడితో పాటు ఓ మహిళ కనిపించింది. ఇప్పుడు అంతా "ఎవరీమె" అని చర్చించుకుంటున్నారు. ఆయనతో చాలా సన్నిహితంగా ఉండటం వల్ల ఆమెపైనే అందరి దృష్టి పడింది. నిజానికి...చాలా దేశాల అధ్యక్షులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదు పుతిన్. ఇదే హాట్ టాపిక్ కాగా...ఇప్పుడు పుతిన్‌తో కలిసి ఉన్న మహిళ ఎవరంటూ అందరూ ఆరా తీస్తున్నారు. అంతే కాదు. ఆమె మిలిటరీ యూనిఫామ్‌లో ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది.
ఆ మహిళ ఎవరు..?
పుతిన్‌తో సన్నిహితంగా కనిపించిన మహిళ పేరు లారిసా సెర్గుకినా. చాలా సందర్భాల్లో పుతిన్‌తో కనిపించారీమె. కొందరు ఆమెను పుతిన్‌కు "సపోర్టర్" అని అంటుంటే మరి కొందరు మాత్రం వారిద్దరి మధ్య రిలేషన్ ఉందని అంటున్నారు. కొత్త ఏడాది సందర్భంగా పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దాదాపు 20 లక్షల మంది సైనికుల ముందు నిలుచుని ప్రసంగించారు. ఈ సమయంలో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు పుతిన్. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలపై నిప్పులు చెరిగారు. అప్పుడే ఆయనతో పాటు ఆ మహిళ కనిపించింది. నిజాకని రష్యా టుడే టీవీ ఛానల్‌లో తొలిసారి పుతిన్‌తో కనిపించింది ఈ మహిళ. అప్పటి నుంచే ఎవరీమె అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ తరవాత 2018 మార్చిలో మాస్కోలో లుజింకి స్టేడియంలో ఓ కన్సర్ట్ జరిగింది. అప్పుడు కూడా ఈమె పుతిన్‌తో కనిపించారు. ఆయనతో సెల్ఫీ కూడా దిగారు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..ఆమె నుదురుపై పుతిన్ ముద్దు కూడా పెట్టారు. దేశాధ్యక్షుడు ఓ మహిళకు అలా ముద్దు పెట్టడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. అయితే..అక్కడి మీడియా కథనాల ప్రకారం ఆమె దుమా కమిషన్ సభ్యురాలు. ఇక మరి కొందరు చెబుతున్న విషయం ఏంటంటే... ఓ షూటింగ్ కోసం ఆమె వచ్చారు. పుతిన్ వెనకాల నిలబడిన వారంతా పెయిడ్ యాక్టర్లని అంటున్నారు. ఇందులో నిజానిజాలేంటో స్పష్టత లేకపోయినా...ఈ మిస్టీరియస్ విమెన్ ఎవరో అంటూ అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.
యుద్ధంపై ఏమన్నారంటే..
రష్యా ఉక్రెయిన్ యుద్ధం 11 నెలలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఏడాది పూర్తవుతుంది. అయినా...ఇప్పటికీ ఈ యుద్ధం కొలిక్కి రాలేదు. కొత్త ఏడాది వచ్చే ముందు కూడా రష్యా ఉక్రెయిన్‌పై మిసైల్స్ వర్షం కురిపించింది. రాజధాని కీవ్‌లోనూ క్షిపణుల దాడులు కొనసాగాయి. అయితే...ఇరు దేశాల అధ్యక్షులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. "విజయం మాదే" అని ఇద్దరూ గట్టిగా చెబుతున్నారు. న్యూ ఇయర్ స్పీచ్‌లలో ఇద్దరి మాటల్లోనూ ఇదే వినిపించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ దేశ సైనికుల ప్రాణత్యాగం గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ సైనికుల ధైర్యసాహసాల్ని మెచ్చుకున్నారు. "ఉనికి కాపాడుకునేందుకే ఈ యుద్ధం" అని ఇద్దరు దేశాధ్యక్షులు చాలా గట్టిగా చెప్పారు. త్వరలోనే ఆశించిన ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.