Jagan Shifting to Vizag: నెలలు కాదు, కొన్ని రోజుల్లోనే విశాఖకు సీఎం జగన్ షిఫ్టింగ్: మంత్రి అమర్నాథ్
సీఎం జగన్ క్లారిటీగానే ఉన్నారని, అందుకే ఢిల్లీలో మాట్లాడుతూ నెలల్లో విశాఖకు వస్తానన్న ఆయన.. తాజాగా పెట్టుబడుల సదస్సులో కొన్ని రోజుల్లో షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చారని మంత్రి అమర్నాథ్ చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికొన్ని రోజుల్లోనే రాజధాని విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. జనవరి 31వ తేదీన ఢిల్లీ వేదికగా ప్రపంచం మొత్తం చూస్తుండగానే మరికొన్ని నెలల్లో తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెప్పారన్నారు. మొన్న పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో రాజధాని విశాఖకు తాను షిఫ్ట్ అవుతానని స్పష్టం చేశారని గుర్తుచేశారు. సీఎం జగన్ క్లారిటీగానే ఉన్నారని, అందుకే ఢిల్లీలో మాట్లాడుతూ నెలల్లో విశాఖకు వస్తానన్న ఆయన.. తాజాగా జరిగిన పెట్టుబడుల సదస్సులో కొన్ని రోజుల్లో షిఫ్ట్ అవుతానని క్లారిటీ ఇచ్చారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కంగారు అక్కర్లేదని, అనుకున్న సమయం కంటే ముందుగానే సీఎం జగన్ నివాసాన్ని విశాఖకు మార్చుకుంటారని వ్యాఖ్యానించారు.
వచ్చే రెండు మాసాల్లో ప్రతి నెలా కనీసం రెండు నుంచి 3 కంపెనీలు స్థాపన అయ్యేలా కార్యాచరణ చేపడతామన్నారు. తమ ప్రభుత్వం కేవలం విశాఖపట్నంపైనే ఫోకస్ చేయడం లేదని, సాగర నగరంతో పాటు అనంతపురం, చిత్తూరు నగరాలను ఐటీ కాన్సెప్ట్ సిటీస్ గా డెవలప్ చేస్తామన్నారు. ఎందుకంటే బెంగళూరుకు దగ్గరగా అనంతపురం ఉండగా, చెన్నైకి సమీపంలో చిత్తూరు ఉందన్నారు. తొలి 6 నెలల్లో ఏపీలో పరిశ్రమలు పెట్టేవారికి ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమైందని రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయన్నారు మంత్రి అమర్నాథ్. వీటి ద్వారా రాష్ట్రంలో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని, త్వరలోనే కంపెనీల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందిస్తామన్నారు.
జగన్‌పై విశ్వసనీయతే పారిశ్రామికవేత్తలను ఏపీకి రప్పించింది
ఆంధ్రప్రదేశ్‌కు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టడం తమకు చాలా ఎనర్జీ ఇచ్చిందంటున్నారు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్. రెండోరోజు పలు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్న తర్వాత పారిశ్రామికతవేత్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి ప్రధాన కారణం జగన్‌పై విశ్వసనీయతే అన్నారు.
సీఎం జగన్ విశ్వసనీయత, ఆయన మాటలను నమ్మే భారతదేశంలోని బిజినెస్ టైకూన్స్ శిఖరాగ్రానికి దిగేలా చేసిందన్నారు అమర్‌నాథ్. ఈ సమ్మిట్ ఫలవంతమైన చర్చలు, పెట్టుబడి, వ్యూహాత్మక సంస్కరణలతో ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విభాగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. పారిశ్రామికవేత్తల అంచనాలను అందుకునేందుకు తమ ప్రభుత్వం వాళ్లు ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడున్ స్ఫూర్తితో పని చేస్తామన్నారు. అమర్‌నాథ్.
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. తన పాలనలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుందని చెప్పారు జగన్ . అనేక రంగాలకు తాము ఇచ్చిన ప్రధాన్యత ఆర్థిక వ్యవస్థను కాపాడాయి అన్నారు. వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పాటు చేశామన్నారు. బ్రాడ్ బాండ్, ఇంటర్నెట్ అందరికీ అందించామన్నారు. పదిహేను రంగాను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నట్టు చెప్పారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయని పేర్కొన్నారు. ఈ సదస్సును విజయవంతం చేసిన పారిశ్రామికవేత్తలకు ధన్యవాదాలు చెప్పారు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులుతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు.