Viral Video: 'మా అమ్మను జైల్లో పెట్టేయండి, నా చాక్లెట్లు కొట్టేస్తుంది'- బుడతడి కంప్లెయింట్
Viral Video: ఓ మూడేళ్ల చిన్నారి.. పోలీస్ స్టేషన్కు వచ్చి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: ఈ తరం చిన్నారుల తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే. వాళ్ల మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఓ చిన్నారి తన అమ్మపై ఫిర్యాదు చేశాడు. ఏముంది అమ్మ కొట్టిందని చెప్పి ఉంటాడు.. అనుకుంటున్నారా? కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి మరీ ఆ బుడ్డోడు కంప్లెయింట్ ఇచ్చాడు.
ఇదీ సంగతి
మధ్యప్రదేశ్ బర్హాన్పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారి తన నాన్నను వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని పోలీసులకు చెప్పాడు. ఇది చూసి షాకైన పోలీసులు.. ఏం జరిగిందని అడిగారు. అయితే కంప్లెయింట్ రాసుకోవాలని ఆ చిన్నారి కోరడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ కంప్లెయింట్ ఏంటంటే?
मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6
— Hindustan (@Live_Hindustan) October 17, 2022
వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. ఈ విషయాలన్నీ బుడ్డోడు ముద్దుముద్దుగా చెప్పడం అక్కడున్న పోలీసులతో నవ్వులు పూయించింది. కంప్లెయింట్ రాసుకున్న మహిళా పోలీస్ బుడ్డోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాశారు.
మాారాం చేసి
పోలీస్ స్టేషన్కు వెళ్లి బుడ్డోడు పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆ బుడ్డోడి అమాయకత్వానికి ఫిదా అయిపోయారు.
Also Read: Viral Video: 'మా అమ్మను జైల్లో పెట్టేయండి, నా చాక్లెట్లు కొట్టేస్తుంది'- బుడతడి కంప్లెయింట్