Viral Video: లతా మంగేష్కర్ పాటను వీళ్లెంత అందంగా పాడారో చూడండి - వైరల్ వీడియో
Viral Video: లతా మంగేష్కర్ పాటను కొంత మంది మహిళలు కలిసి పాడిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
గాన కోకిల లతా మంగేష్కర్ ప్రస్తుతం మనతో లేకపోయినా ఆమె పాడిన పాటలు ఇంకా అందరి నోట నానుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది ఆమె పాటలకు డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఆ పాటలు పాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే...క్షణాల్లో అవి వైరల్ అయిపోతు న్నాయంటే...లతాజీ క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థమవుతోంది. ఇప్పుడు ఆమె పాడిన మేరా దిల్ యే పుకారే పాట మరోసారి వైరల్ అవుతోంది. కొందరు మహిళలు ఈ పాటను పాడిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఓ మహిళ ఢోలక్ వాయిస్తూ పాడుతుంటే...చుట్టూ ఉన్న వాళ్లంతా కోరస్ ఇస్తున్నారు. నెటిజన్లను ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటోంది. Trending Song అంటూ ఇన్‌స్టాలో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. నవంబర్ 29న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‌స్టా రీల్స్‌లో ఇంక వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే 26 లక్షల మంది ఈ వీడియోను చూశారు. వేలాది మంది షేర్ చేశారు. ఇక వందలాది కామెంట్స్ కూడా వచ్చాయి. "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా పాడుతున్నారో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram