By: Ram Manohar | Updated at : 14 May 2023 12:32 PM (IST)
పొట్ట తగ్గించుకోడానికి పొట్టపై అప్పడాల కర్రతో రుద్దుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. (Image Credits: Twitter)
Viral Video:
పొట్టపై అప్పడాల కర్రతో..
పొట్ట వచ్చిందంటే కరిగించుకోవడం అంత సింపుల్ కాదు. టేస్టీగా ఉందని జంక్ ఫుడ్ అంతా ఎప్పుడు పడితే అప్పుడు లాగించేస్తారు. ఆ తరవాత ఊబకాయంతో ఇబ్బంది పడతారు. ఇప్పుడు చాలా మంది పొట్ట తగ్గించుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారు. పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోడానికి జిమ్‌లలో రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చెబుతుంటారు. ఇంకొందరు చాలా స్ట్రిక్ట్‌గా డైట్ పాటిస్తారు. ఇప్పుడు కొత్త కొత్త డ్రింక్స్, ఫుడ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని తింటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అయితే...పొట్ట తగ్గించుకోడానికి ఆ మెథడ్స్ అన్నింటితో పాటు మరో ఎక్సర్‌సైజ్‌నీ కనిపెట్టాడో జిమ్ ట్రైనర్. రొట్టెలు చేసుకున్న కర్ర ఉంటుందిగా. దాంతో పొట్టపై రుద్దితే పొట్ట తగ్గిపోతుందని చెప్పాడు. ఇంకేముంది ట్రైనింగ్ సెంటర్‌కి వచ్చే ఆడవాళ్లందరూ తలా ఓ రొట్టెల కర్ర తెచ్చుకున్నారు. అందరూ వరుసలో నిలబడి డ్యాన్స్ చేస్తూ పొట్టపై రొట్టెల క్రరతో రుద్దుకున్నారు. ఓ వైపు నవ్వుకుంటూనే ఎక్సర్‌సైజ్ చేశారు. ఈ వీడియోని ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇంకే ముంది కాసేపటికే వైరల్ అయిపోయింది. పొట్ట ఇలా కూడా తగ్గించుకోవచ్చా అని ఆశ్చర్యపోతున్నారంతా. అంతే కాదు. ఇదే వీడియోలో కొందరు స్కాల్ప్ మసాజర్లతో స్ట్రెస్ తగ్గించుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 8 లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ అయితే ఆగడం లేదు. కొందరు పడిపడి నవ్వుకుంటున్న ఎమోజీలు షేర్ చేస్తున్నారు. ఇంకొందరు "ఇదేం పిచ్చిరా నాయనా" అని కామెంట్ చేస్తున్నారు.
"బరువులు ఎత్తితేనే కాదు. ఇలా కూడా కొవ్వు కరిగిపోతుంది" అని ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Main bol raha hu bohot scope hai iss desh mein. pic.twitter.com/YAEZhltCzM
— Chirag Barjatya (@chiragbarjatyaa) May 4, 2023
Main bol raha hu bohot scope hai iss desh mein. pic.twitter.com/YAEZhltCzM
— Chirag Barjatya (@chiragbarjatyaa) May 4, 2023
Main bol raha hu bohot scope hai iss desh mein. pic.twitter.com/YAEZhltCzM
— Chirag Barjatya (@chiragbarjatyaa) May 4, 2023
మరో చిట్కా..
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటారు. ఇప్పుడు యాపిల్ జ్యూస్ తాగితే మీ బొజ్జ చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవచ్చని చెబుతోంది కొత్త అధ్యయనం. యాపిల్ లోని పాలీఫెనాల్స్ శరీర కొవ్వుని తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు వెల్లడించారు. అధ్యయనంలో పాల్గొన్న వారితో యాపిల్ జ్యూస్ ని ఎనిమిది వారాల పాటు తాగించారు. ఇది తాగిన తర్వాత విసెరల్ ఫ్యాట్ ప్రాంతంలో తేడాను పరిశోధకులు గమనించారు. పాలిఫెనాల్ అధికంగా ఉండే పానీయం దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గడంలో గణనీయమైన మార్పులు చూశారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం వల్ల అనేక ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది కార్డియో వాస్కులర్, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో మంటని పెంచుతుంది.
Also Read: మొబైల్ పోగొట్టుకున్నారా? అయితే ఈ పోర్టల్‌లో ట్రాక్ చేసుకోవచ్చు
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో ఎలక్ట్రానిక్ డివైజ్ వాడిన ముగ్గురు అరెస్ట్
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి
Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Errabelli Dayakar Rao: త్వరలో బీసీ కుల వృత్తుల వారికి రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహకారం: మంత్రి ఎర్రబెల్లి
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!