అన్వేషించండి

Viral Video: నేను మీ సర్వెంట్‌ను కాదు, ప్రయాణికుడిపై ఎయిర్‌హోస్టెస్ అసహనం - వైరల్ వీడియో

Viral Video: ఇండిగో ఎయిర్‌ లైన్స్‌లో ప్రయాణికుడికి, ఎయిర్‌ హోస్టెస్‌కు వాగ్వాదం జరిగింది.

Viral Video:

ప్యాసింజర్ - ఎయిర్ హోస్టెస్ వాగ్వాదం 

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో ఓ ప్రయాణికుడు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగినట్టు ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య గొడవ జరుగుతుండగా...మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆహారం విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వలేదని, లిమిటెడ్‌గా
పెట్టారని ప్రయాణికుడు గొవడకు దిగాడు. అయితే...దీనిపై ఇండిగో సంస్థ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు ఇండిగో సిబ్బందిని తిట్టి పోస్తుండగా..మరి కొందరు మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 19న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. "ఇండిగోలో టికెట్ బుక్ చేసుకుని పెద్ద తప్పు చేశాను" అని గురుప్రీత్ సింగ్ అనే యూజర్ ట్వీట్ చేశారు. 
"ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఫుడ్ చాయిస్ ఉంటుంది. కొందరు పర్లేదులే అని మేనేజ్ చేసుకుంటారు. కొందరు అలా కన్విన్స్ అవ్వలేరు" అని ట్వీట్ చేశారు. "ఇండిగో సిబ్బంది ప్రయాణికుడితో ఎలా ప్రవర్తించిందో.. ప్రయాణికుడు ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేశాడో నేను కళ్లారా చూశాను" అని కామెంట్ చేశాడు. ఈ వీడియోలో ఎయిర్ హోస్టెస్ ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ...ఆ ప్రయాణికుడు ఎవరన్నది మాత్రం తెలియలేదు. ఆ ప్రయాణికుడు తమతో చాలా దురుసుగా ప్రవర్తించాడని, ఈ కారణంగానే ఓ యువతి కన్నీళ్లు కూడా పెట్టుకుందని సిబ్బంది ఆరోపిస్తోంది. 

ఇలా జరిగింది..

ఎయిర్ హోస్టెస్ ఫుడ్ విషయంలో ప్రయాణికుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. "మా వైపు వేలెత్తి చూపిస్తూ అరుస్తూ మాట్లాడుతున్నారు. మీ వల్లే మాలో ఒకరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా కార్ట్‌లో ప్యాసింజర్స్‌కి సరిపడ మీల్స్ ఉన్నాయి. వాటికంటూ ఓ కౌంట్ ఉంది. అవి మాత్రమే మేం సర్వ్ చేయగలం" అని చెప్పింది ఎయిర్‌ హోస్టెస్. ఇంతలో ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు. "ఎందుకు అరుస్తున్నావ్" అంటూ ప్రశ్నించాడు. అందుకు వెంటనే "మీరే మాపై అరుస్తున్నారు కాబట్టి" అని గట్టిగా బదులిచ్చింది ఎయిర్ హోస్టెస్. "ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. మేమెంతో గౌరవంగా మీకు అంతా వివరిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి" అని చెప్పింది. అయితే...ఆ ప్యాసింజర్ వేలెత్తి చూపిస్తూ "నోర్మూయ్" అని అరిచాడు. దీంతో...ఆగ్రహంతో ఊగిపోయిన ఎయిర్ హోస్టెస్ "నేను మీ సర్వెంట్‌ని కాను" అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడితో ఈ వాగ్వాదం ముగిసిపోయింది. ఆ తరవాత
ఏం జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. 

Also Read: Adar Poonawalla: కొవిడ్‌పై భయం అక్కర్లేదు, వ్యాక్సినేషన్‌లో మన ట్రాక్ రికార్డ్ తెలుసుగా - అదర్ పూనావాలా

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget