Viral News: రైల్వేశాఖ నిర్లక్ష్యం- ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం, ఫొటోలు వైరల్!
Viral News: ఓ రైల్లో ప్రయాణిస్తోన్న వ్యక్తి ఆర్డర్ చేసిన ఆమ్లెట్‌లో బొద్దింక వచ్చింది.
Viral News: నిర్లక్ష్యం కారణంగా రైల్వేశాఖ మరోసారి ప్రయాణికుల తిట్లు తినాల్సి వస్తుంది. తాజాగా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికుడు కొన్న ఆహారంలో బొద్దింక రావడం కలకలం రేపింది. దీనిపై సోషల్ మీడియాలో రైల్వేశాఖను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
ఆమ్లెట్‌లో
దిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి.. తన చిన్నారికి ఆమ్లెట్ ఆర్డర్ చేశాడు. అయితే అందులో బొద్దింక కనిపించింది. బాలిక ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
16dec2022,We travel from Delhi by (22222). In morning, we ordered extra omlate for baby. See attach photo of what we found! a cockroach? My daughter 2.5 years old if something happened so who will take the responsibilities @PMOIndia @PiyushGoyal @PiyushGoyalOffc @RailMinIndia pic.twitter.com/X6Ac6gNAEi
— Yogesh More - designer (@the_yogeshmore) December 17, 2022
ఆ చిన్నారి తండ్రి.. బొద్దింక ఉన్న ఆమ్లెట్ చిత్రాన్ని.. రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పొరపాటు వల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ ట్వీట్ నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇందులో ఆమ్లెట్‌పై బొద్దింక స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. క్యాటరింగ్ డిపార్ట్‌మెంట్, రైల్వేశాఖను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Also Read: Guwahati news: కొంప ముంచిన షాంపూ! ఆ ఒక్క మాటతో పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు!