Guwahati news: కొంప ముంచిన షాంపూ! ఆ ఒక్క మాటతో పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు!
Guwahati news: ఓ షాంపూ కారణంగా పెళ్లి రద్దయిన ఘటన అసోంలో జరిగింది.
Guwahati news: ఈ మధ్య కాలంలో చాలా సింపుల్ విషయాలకు పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. ఒకవేళ జరిగినా.. విడాకులు తీసుకుని మరీ కొత్త జంట విడిపోతున్నారు. అయితే తాజాగా అసోంలో జరిగిన ఓ ఘటన అవాక్కయ్యేలా చేస్తుంది. షాంపూ కారణంగా పెళ్లి రద్దయింది. అవును.. మీరు విన్నది నిజమే! కేవలం ఓ షాంపూ.. వల్ల వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడు.
ఇదీ జరిగింది
'షాంపూ.. కారణంగా షాదీ క్యాన్సిల్' వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. గువాహటిలో ఓ వివాహ వేడుకలో భాగంగా వధువు ఇంటికి వరుడు కొన్ని వస్తువులను పంపాడు. అయితే అందులో పంపిన షాంపూ ధరం చాలా చౌకగా ఉండడంతో వధువుకు కోపం వచ్చింది. వెంటనే కోపంతో వరుడికి ఓ మెసేజ్ పెట్టింది. దీంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేశాడు.
గువాహటికి చెందిన ఓ ఇంజనీర్‌తో ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి వివాహం ఈ నెల 14న జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు పెళ్లి కూతురుకు విలువైన బహుమతులు, కొన్ని వస్తువులను పంపించారు. ఆ వస్తువులలో షాంపూ కూడా ఉంది. కానీ అది చాలా తక్కువ రేటు ఉన్న షాంపూ. దీంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది.
'నీ స్థాయి ఇదేనా?' అంటూ వరుడికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింది. ఇది చూసిన వరుడు తీవ్ర మనస్తాపానికి గురై.. పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వధువు కుటుంబ సభ్యులు అతనికి క్షమాపణలు చెప్పినా వరుడు మనసు మార్చుకోలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Kim Jong Un look-alike: ఖతార్‌లో మెరిసిన కిమ్- ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్స్ కోసం!