Viral News: పిల్లాడ్ని చంపేస్తారా? పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వరా!
Viral News: పెళ్లి పీటలపై కూర్చొని ఓ వరుడు సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో పనిచేస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News: కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత కూడా చాలా కంపెనీలు ఇంకా తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఆప్షన్‌ను కొనసాగిస్తున్నాయి. కానీ ఇదే మంచి అవకాశం అన్నట్లు వారితో ఎక్కువ గంటలు పని కూడా చేయిస్తున్నాయి. కనీసం తినడానికి కూడా లేవకుండా పని చేస్తూనే ఉండే ఉద్యోగులను మీరు చూసి ఉంటారు. కానీ పెళ్లి పీటలపై కూర్చొని కూడా పని చేసే ఉద్యోగిని ఎప్పుడైనా చూశారా?
వైరల్
ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతూ, పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నాడు. కానీ పెళ్లి పీటల మీద ఉన్న వరుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా పని చేసుకుంటున్నాడు. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఎక్కువగా కోల్‌కతాకు చెందిన అకౌంట్ల నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఏది ఏమైనా ఈ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్‌ను ఈ పెళ్లికొడుకు మరోస్థాయికి తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
"కనీసం పెళ్లి రోజున కూడా సెలవు ఇవ్వరా?" అని కొందరు కామెంట్ చేయగా.. మరి కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. "పెళ్లి రోజున పని చేయాలని ఏ సంస్థ కూడా చెప్పదు" అంటున్నారు. అయితే దీనిని ఏదో సరదాకి చేసిన పనిగా కొంతమంది కొట్టిపారేశారు.
Also Read: UP Massive Fire: ఇన్వర్టర్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్- మంటలు చెలరేగి ఆరుగురు మృతి!