Bike Stunts: వికటించిన మైనర్ల బైక్ విన్యాసాలు, కిందపడి గాయాలు, చుట్టుముట్టిన కేసులు
Bike Stunts: ఎలాంటి హెల్మెట్ ధరించకుండానే ఇద్దరు యువకులు బైక్ పై ప్రమాదకర స్టంట్లు చేశారు. నేరుగా వెళ్లి డైవడర్ ను ఢీకొట్టి ఇద్దరూ గాయాలపాలయ్యారు.
Bike Stunts: హెల్మెట్లు కూడా పెట్టుకోలేదు. ఇద్దరూ కలిసి బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేశారు. అతివేగాన్ని నియంత్రిలేక నేరుగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయాల పాలయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియో ఆధారంగానే నిందితులను గుర్తించారు. బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
కర్ణాటకలోని విజయనగర్ జిల్లా హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో శనివారం ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేశారు. అయితే వేగంగా వెళ్లి.. ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్లపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో.. యువకులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై స్టంట్లు చేశారు. కొద్ది సేపటికే బ్యాలెన్స్ తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే వీడియో ద్వారా వీరిని గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రాణాలతో చెలగాటం
ఇటీవల కాలంలో బైక్ రేస్ లు, స్టంట్స్ చేయడం పెరిగింది. మార్కెట్ లో వస్తున్న కొత్త రకం బైక్ లతో విన్యాసాలు చేస్తూ యువత తమ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. బైక్ స్టంట్స్ చేయడం అంటే ఎంతో శిక్షణ, తగిన జాగ్రత్తలు ఉండాలి. అలా కాకుండా యువత రోడ్లపై ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ స్టంట్స్ చేస్తున్నారు. అయితే ఎటువంటి సాధన చేయకుండా, శిక్షణ తీసుకోకుండా విన్యాసాలు చేస్తూ కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా, ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. కదులుతున్న బైక్ మీద విన్యాసాలు చేస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. బైక్ చేతిలో ఉంటే చాలు, బైక్‌పై నిలబడి నడపడం, బైక్ స్పీడ్ పెంచి ఇతరులకు ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. బైక్ స్టంట్ చేసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది తెలిసి కూడా యువకులు సినిమా స్టైల్లో బైక్ స్టంట్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం. అంతే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీసిన సందర్భాలు లేకపోలేదు.
తోటి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలు
దేశశంలోని చాలా చోట్లు ఇలాంటి ఆగడాలు రోజురోజుకు విపరీతం అవుతున్నాయి. అర్ధరాత్రుళ్లు బైక్ పై స్టంట్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్నారు కొందరు. ఎవరూ లేని రోడ్లపై పలువురు, రద్దీగా ఉన్న రహదారులపై మరికొంత మంది బైక్ లతో స్టంట్ చేస్తున్నారు. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. విద్యార్థులు ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోకిరిల స్టంట్స్ తో ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా అధిక సౌండ్ లు చేసే సైలెన్సర్లు వినియోగిస్తూ ధ్వని కాలుష్యం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తెస్తున్నారు. పోకిరిల చేష్ఠలకు అడ్డుకుట్టవేయాలని పోలీసులను కోరుతున్నారు స్థానికులు. బైక్ స్టంట్స్ పై నిఘా పెట్టి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.