అన్వేషించండి

Vijayawada Trains: విజయవాడ నుండి తరలి వెళ్లిపోతున్న రైళ్లు... మిగిలింది 6 ఎక్స్ ప్రెస్ లే అంటే నమ్ముతారా..?

Andhra Pradesh News | విజయవాడ నుండి రైళ్లు తరలి వెళ్లిపోతున్నాయి. మిగిలింది 6 ఎక్స్ ప్రెస్ లే. ఎందుకీ పరిస్థితి, అసలేం జరుగుతుందో ఈ వివరాలు చదివితే అర్థమవుతుంది.

 విజయవాడ.. భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ లలో ఒకటి.  హౌరా- చెన్నై, న్యూ ఢిల్లీ -చెన్నై, విజయవాడ -నిడదవోలు (లూప్ ) వంటి కీలక మైన రైల్వే లైను ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 10 ప్లాట్ ఫామ్ లు,24 ట్రాకులు తో రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే రైళ్లన్నీ ఇతర స్టేషనులకు తరలి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం 6 ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే విజయవాడ నుంచి (అంటే ఆరిజన్ స్టేషన్ విజయవాడ గా)  నడుస్తున్నాయి. 


మిగిలింది ఈ 6 ఎక్స్ ప్రెస్ రైళ్ళే 

 ప్రస్తుతం విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరే  ఎక్స్ప్రెస్ రైళ్లు 6 మాత్రమే ఉన్నాయి. అవి 3 సిస్టర్స్ గా పిలుచుకునే 

1) ట్రైన్ నెంబర్ 12713- విజయవాడ- కాచిగూడ- శాతవాహన ఎక్స్ ప్రెస్ 

2) ట్రైన్ నెంబర్ 12711- విజయవాడ- చెన్నై - పినాకిని ఎక్స్ ప్రెస్

3)  ట్రైన్ నెంబర్ 12718- విజయవాడ- విశాఖపట్నం- రత్నాచల్ ఎక్స్ ప్రెస్

 ఈ మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లను త్రీ సిస్టర్స్ గా పిలుస్తారు. ఈ మూడూ ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయవాడ స్టేషన్ నుండి  బయలుదేరి మళ్లీ సాయంత్రానికి  విజయవాడ చేరుకుంటాయి.

 ఇది కాక మిగిలింది మరో మూడు ఇంటర్ సిటీ లే.. 

అవి ట్రైన్ నెంబర్ 12707/12708 చెన్నై- విజయవాడ- చెన్నై జన శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది మంగళవారం మినహా మిగిలిన 6 రోజులూ ప్రయాణిస్తుంది. విజయవాడలో  మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరుతుంది.

2) 12743/12744- గూడూరు- విజయవాడ- గూడూరు- విక్రమసింహపురి అమరావతి ఎక్స్ ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు విజయవాడలో 6 గంటలకు బయలుదేరుతుంది. 

3) 12796/12795 లింగంపల్లి- విజయవాడ- లింగంపల్లి  ఎంప్లాయిస్ స్పెషల్.  ఈరైలు ప్రతిరోజు సాయంత్రం 5:30 కి విజయవాడలో బయలుదేరి లింగంపల్లి వెళుతుంది.
ఓవరాల్ గా విజయవాడకు ప్రస్తుతం మిగిలిన  ఆరు ఇంటర్సిటీ రైళ్లు ఇవి మాత్రమే. 

 విజయవాడ నుంచి తరలి వెళ్లిపోయిన రైళ్లు ఇవే

 ఇంతకుముందు  విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లే ధర్మవరం రైళ్లను  ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఒకటి, నరసాపురం మరొకటి గా మార్చేశారు. అలాగే విజయవాడ హౌరా మధ్య తిరిగే  హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ ను తిరుపతి కి తీసుకుపోయారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమైన విజయవాడ రాయగడ ప్యాసింజర్ ను ఎక్స్ప్రెస్ గా ప్రమోట్ చేసి  దానిని గుంటూరు రాయగడగా మార్చేశారు. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందేభారత్ ను కూడా నరసాపురం నుంచి నడిపేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న ప్రచారం  బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే  అతి ముఖ్యమైన విజయవాడ రైల్వే స్టేషన్ ఆరిజన్ స్టేషన్గా ఉండే ఆరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లు కొన్ని ప్యాసింజర్ రైళ్లు మాత్రమే మిగులుతాయి.

అసలు సమస్య అదే

 విజయవాడ స్టేషన్ కి అతి ముఖ్యమైన సమస్య స్థలం లేకపోవడం. ఎప్పుడో 1888లో  కట్టిన ఈ రైల్వే స్టేషన్ కు గతంలో ఏడు ప్లాట్ ఫామ్ లు ఉండేవి. ప్రస్తుతం వన్ టౌన్ సైడు  మరో మూడు ప్లాట్ ఫామ్ లు పెంచి  మొత్తానికి 10 చేశారు. ప్రస్తుతం ఈ స్టేషన్ NSG 1 క్యాటగిరి లో ఉంది. అంటే కనీసం లక్ష మంది ప్రయాణికులు రోజు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. 190 ట్రైన్స్,170 గూడ్స్ రైళ్లు విజయవాడ స్టేషన్ మీదుగా ప్రతిరోజు ప్రయాణిస్తుంటాయి. దానితో స్టేషన్ నుండి కొత్తగా బయలుదేరే రైళ్లను వేయలేకపోతోంది రైల్వే శాఖ. హలో కొత్తగా వేసే రైళ్లకి ఇక్కడ ప్లేస్ ఉండటం లేదు. ఏదన్నా కొత్త రైలు విజయవాడ నుంచి బయలుదేరేలా దానిని ప్లాట్ ఫామ్ పై ఎక్కువసేపు నిలిపి ఉంచాలి. దానివల్ల వేరే రైళ్లకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ప్రస్తుతం కొత్త రైళ్లను విజయవాడ నుంచి బయలుదేరేలా వేయడం లేదు. పోనీ ప్లాట్ఫామ్ లు పెంచుదామా అంటే విజయవాడ రైల్వే స్టేషన్ సరిగ్గా నగరం నడిబొడ్డున ఉంది. అక్కడ కొత్తగా ప్లాట్ ఫామ్ లు కట్టే అవకాశం లేదు.


రెడీ అవుతున్న శాటిలైట్ స్టేషన్ లు- ఈ సమస్య కు అదే పరిష్కారం

 ప్రస్తుతం ఈ సమస్యకు  విజయవాడకి చుట్టుపక్కల  శాటిలైట్ స్టేషన్లు కట్టడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది రైల్వే శాఖకు. అందుకే విజయవాడ నిడదవోలు మార్గంలో రామవరప్పాడు, విజయవాడ హౌరా మార్గంలో గుణదల, విజయవాడ న్యూఢిల్లీ మార్గంలో  రాయనపాడు స్టేషన్లను  సాటిలైట్ స్టేషన్లుగా  ఆధునికంగా మార్చుతున్నారు. మరొక మూడు నాలుగు నెలల్లో ఇవి రెడీ అయిపోతే  చాలా ట్రైన్లను విజయవాడ మెయిన్ స్టేషన్కు రాకుండా డైవర్ట్ చేయొచ్చు. అప్పుడు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లేలా  సరికొత్త రైళ్లను  కేటాయించే అవకాశం కేంద్రానికి ఉంటుంది. అందుకే రైల్వే డిపార్ట్మెంట్  ఈ సాటిలైట్ స్టేషన్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?

వీడియోలు

మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
Yashasvi Jaiswal Century vs SA | వన్డేల్లోనూ ప్రూవ్ చేసుకున్న యశస్వి జైశ్వాల్ | ABP Desam
Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
Virat kohli No Look six vs SA | తనలోని బీస్ట్ ను మళ్లీ బయటకు తీస్తున్న విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు రతన్ టాటా పేరు
Kadapa Mayor Election: కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం.. 9న హైకోర్టులో విచారణ
కడప మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌, డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం..
Smriti Mandhana Wedding: పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
పలాష్ ముచ్చల్, స్మృతి మంధానా పెళ్లి రద్దు.. క్లారిటీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్
Suriya 47 Movie: మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
మలయాళ దర్శకుడితో సూర్య సినిమా... కొత్త బ్యానర్ షురూ - రోల్ ఏమిటంటే?
FIFA World Cup 2026 : FIFA ప్రపంచ కప్ 2026  సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
FIFA ప్రపంచ కప్ 2026 సమయంలో గ్రహాంతరవాసులు వస్తారా! బాబా వాంగ ఏం చెప్పారు?
Goa Fire Accident: గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
OTT Spy Movies: 'ధురంధర్' సినిమా కన్నా ముందుగా  ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
'ధురంధర్' సినిమా కన్నా ముందుగా ఈ స్పై థ్రిల్లర్స్ చూడండి, ఈ OTT ల్లో అందుబాటులో ఉన్నాయ్!
Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
Embed widget