News
News
X

Vietnam Fire Accident: బార్‌లో చెలరేగిన మంటలు- 33 మంది సజీవదహనం!

Vietnam Fire Accident: వియత్నాంలోని ఓ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 33కు చేరింది.

FOLLOW US: 

Vietnam Fire Accident: వియత్నాంలోని ఓ బార్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 33 మంది వరకు మృతి చెందారు. హో చి మిన్ నగరంలో కారౌకే కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఇలా జరిగింది 

కారౌకే కాంప్లెక్స్ బార్‌లో ఈ భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం రాత్రి ఆ బార్‌లోని మూడ‌వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క‌స్ట‌మ‌ర్లు, సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. రెండు, మూడో ఫ్లోర్ల నుంచి కొంతమంది కిందకు దూకారు. 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాప‌క సిబ్బంది ఆ బారుకు వ‌చ్చి మంట‌ల్ని ఆర్పారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయింది. 33 మంది మృతి చెందారు. ఇందులో 15 మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు సహాయక సిబ్బంది. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బార్‌లో 60 మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్న‌ట్లు సమాచారం. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

అమెరికాలో కాల్పులు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని మెంఫిస్‌లో ఓ యువకుడు కారులో నగరమంతా తిరుగుతూ ఏడుచోట్ల కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఇదీ జరిగింది

19 ఏళ్ల ఎజెకిల్ కెల్లీ అనే యువకుడు ఓ మహిళను చంపి ఆ కారులో మొత్తం నగరమంతా తిరుగుతూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులను ఫేస్‌బుక్‌లో లైవ్ ఇచ్చాడు.

బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ విధ్వంసం రాత్రి వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: Viral Video: ఇదేం గోకుడు సామీ! తుక్కుతుక్కు చేసేశావ్ కదా గణేశా!

Also Read: Amit Shah Mumbai visit: అమిత్ షా పర్యటనలో భద్రతా లోపం- ఆంధ్రా ఎంపీ సెక్రటరీ అరెస్ట్!

Published at : 08 Sep 2022 02:58 PM (IST) Tags: Vietnam karaoke bar fire kills

సంబంధిత కథనాలు

Hate Crime Canada: కెనడాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేషం, భగవద్గీత పార్క్ బోర్డ్ తొలగించిన దుండగులు

Hate Crime Canada: కెనడాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేషం, భగవద్గీత పార్క్ బోర్డ్ తొలగించిన దుండగులు

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Breaking News Live Telugu Updates: మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

HCL Jobs: హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!

HCL Jobs: హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు, ఈ అర్హత తప్పనిసరి!

Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త ట్రాఫిక్ రూల్స్! ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.వెయ్యి ఫైన్ వసూలు

Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త ట్రాఫిక్ రూల్స్! ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.వెయ్యి ఫైన్ వసూలు

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!