Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి చివరి క్షణాలు, చాపర్ క్రాష్ అయ్యే ముందు వీడియో వైరల్
Iran President Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యే ముందు ఇరాన్ ప్రెసిడెంట్ చాపర్‌లో ఉన్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
Iran President's Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు రికార్డ్ అయిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. ఆయన చాపర్‌లో ప్రయాణిస్తున్న వీడియోలని స్థానిక మీడియా (Last Visuals of Iran President) విడుదల చేసింది. ఇందులో ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమిర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. రైసీ విండో సీట్ వైపు కనిపించగా ఆయనకు ఎదురుగా హుసేన్ కూర్చున్నారు. వీళ్లిద్దరితో పాటు మరి కొంత మంది అధికారులున్నారు. ఈ చాపర్ టేకాఫ్ అయిన అరగంట తరవాత కాంటాక్ట్ మిస్ అయింది. దాదాపు 16 గంటల పాటు తీవ్రంగా శ్రమిస్తే గానీ ఆచూకీ దొరకలేదు. ప్రజలకు సేవలందించిన ఇబ్రహీం రైసీ అమరుడయ్యాడంటూ అక్కడి టెలివిజన్ కథనాలు ప్రసారం చేసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ అధికారులు ముందు చెప్పినప్పటికీ ఆ తరవాతే అసలు చర్చ మొదలైంది. ఇది కచ్చితంగా ప్రమాదం అయ్యుండదన్న సందేహాలు వ్యక్తవుతున్నాయి.
ایرانی صدر ابراہیم رئیسائی کا آخری سفر، ہیلی کاپٹر حادثے سے پہلے ڈیم کے فضائی دورے کی ویڈیو۔۔!!#Iran pic.twitter.com/LOn5h1Lsdq
— Khurram Iqbal (@khurram143) May 20, 2024
16 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది ఇబ్రహీం రైసీ మృతదేహాన్ని కనుగొంది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి డెడ్‌బాడీ ఆచూకీ కూడా దొరికిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ డెడ్‌బాడీలను తీసుకొస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Iran President Ebrahim Raisi, Foreign Minister died in a helicopter crash due to heavy fog in mountain terrain; Mortal remains of the deceased being retrieved
— ANI (@ANI) May 20, 2024
(Source: Screenshot from video shared by Iran's Press TV) pic.twitter.com/gTWsmzkkCu