Snake dance: ఇంటిపై నాగు పాముల సయ్యాట.. వీడియో వైరల్
ఓ ఇంటిపై పాములు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాములను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది రెండు పాములు ఇంటిపై సయ్యాటలాడుతూ కనిపిస్తే? వామ్మో.. గుండె జారుతుంది కదూ. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ.. పోస్ట్ చేసిన ఈ వీడియో చూస్తే.. అదే ఫీలింగ్ కలుగుతుంది. పాములు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చూడండి అని పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. రెండు పాములు ఇంటి పై కప్పుపై రొమాన్స్ చేసుకుంటూ కనిపించాయి. ఒకదాన్ని ఒకటి అల్లేసుకుని.. సయ్యాటలో మునిగితేలాయి. దీంతో ఆ ఇంట్లో ఉంటున్నవారు దాన్ని వీడియో తీశారు. కొద్ది సేపటి తర్వాత ఆ పాములు కప్పుకు వేలాడుతూ కిందపడ్డాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు.. ఎక్కడ చోటుచేసుకుందనేది మాత్రం తెలియరాలేదు. అయితే, పాములు సంపర్కం సమయంలో ఇలాగే డ్యాన్స్ చేస్తాయని పలువురు తెలుపుతున్నారు. ఈ వీడియో చూస్తే తప్పకుండా మీరు కూడా ఫిదా అవుతారు.
వీడియో:
పాములు కనిపించినప్పుడు కంగారు పడి చంపేయకూడదు. మనం వాటిని ఏమీ చేయకపోతే.. అవి కూడా మనల్ని ఏమీ చేయవు. పాములు కనిపించిన వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాలి. వాటిని పట్టుకొనే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. ఒక వేళ అవి కాటేస్తే రివేంజ్ తీర్చుకొనే ప్రయత్నం చేయకుండా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇటీవల కొంతమంది పాములపై పగ తీర్చుకోవడం కోసం వాటిని కొరికి చంపేస్తున్నారు.
ఇటీవల బీహార్‌లోని నలంద జిల్లా చాందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదోదేహ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రమా మహతో మద్యం తాగి ఇంటి ముందు కూర్చున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పాము పిల్ల రమాను కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రమా దాన్ని తోక పట్టుకుని నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని కొరుకుతూ నమిలేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆ పాము ముఖం మీద అనేకసార్లు కాటేసింది. దీంతో రమా పామును తీసుకెళ్లి ఓ చెట్టు కింద వదిలేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. అది పిల్ల పామమని, అది కాటేస్తే ఏం కాదని చెప్పి.. నేరుగా తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అయితే, తర్వాతి రోజు ఉదయం రమా చనిపోయి కనిపించాడు.
Also Read: 335 మందితో డేటింగ్.. స్ఫూర్తి నింపుతున్న యువకుడి డేరింగ్ స్టెప్, మరో 30 మందిని కలిస్తే..
తాజాగా ఒడిశాలోని జాప్‌పూర్ జిల్లా గంభరిపటియా గ్రామానికి చెందిన కిశోర్ బద్రా బుధవారం రాత్రి పొలం పనులు ముంగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అతడి కాలుపై ఓ పాము కాటేసింది. దీంతో ఆగ్రహానికి గురైన కిశోర్ ఆ పామును పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఆ తర్వాత చచ్చిన పామును చేత్తో పట్టుకుని గ్రామానికి వెళ్లాడు. తన భార్యకు జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆ పామును తన స్నేహితులకు చూపించాడు. దీంతో అతడు పామును కొరిక చంపేశాడనే వార్త ఊరంతా పాకింది. అయితే, పాము కరిస్తే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందాలని స్థానికులు సలహా ఇచ్చినా కిశోర్ పట్టించుకోలేదు. పాము కాటుకు సాంప్రదాయ చికిత్సను తీసుకున్నాడు. లక్కీగా కిశోర్ ప్రాణాలతోనే ఉన్నాడు. పాము కాటు అతడిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!