ప్రాంక్ చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థి, వీడియో కాల్‌లోనే మృతి
Prank Video: ప్రాంక్ వీడియో కాల్ ఇండోర్‌లో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది.
Prank Video Call Goes Wrong: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ స్టూడెంట్ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్రెండ్స్‌ని ఫూల్ చేయాలని వీడియో కాల్ చేశాడు. వీడియో కాల్‌లో ఉండగానే ఓ స్టూల్ తెచ్చుకుని సీలింగ్‌కి ఉరి వేసుకున్నట్టుగా నటించాడు. ఇదంతా ప్రాంక్ అని చెబుతూ ఏదో మాట్లాడబోయాడు. ఆ సమయంలోనే స్టూల్ ఒక్కసారిగా కింద పడిపోయింది. వెంటనే తాడు గొంతుకు బిగుసుకుని విద్యార్థి చనిపోయాడు. వీడియో కాల్‌లోనే స్నేహితుడు అలా చనిపోవడాన్ని చూసి తోటి ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. మృతుడు అభిషేక్ 11వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
"అభిషేక్ రఘువంశి ఏప్రిల్ 1వ తేదీన తన ఫ్రెండ్స్‌ని ఫూల్స్‌ని చేయాలని వీడియో కాల్ చేశాడు. ఓ స్టూల్ తెచ్చుకుని పైన తాడు కట్టి దాన్ని మెడకు చుట్టుకున్నాడు. ప్రాంక్ చేయాలనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి స్టూల్ మించి జారిపోయాడు. ఒక్కసారిగా ఆ తాడు గట్టిగా మెడకు చుట్టుకుంది. అలా చాలా సేపు విలవిల్లాడి చనిపోయాడు"
- పోలీస్ అధికారులు