Ravan Dahan in UP: స్మార్ట్‌ఫోన్‌తో రావణ దహనం, ఈ స్టూడెంట్స్‌ది మామూలు బుర్ర కాదు
Ravan Dahan in UP: గోరఖ్‌పూర్ ITM విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో రావణదహనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Ravan Dahan in UP:
గోరఖ్‌పూర్ ITM విద్యార్థుల ఆవిష్కరణ..
విజయదశమి సందర్భంగా రావణ దహనం చేయటం మామూలే. ఉత్తరాదిలో ఈ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. భారీగా జనాలు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. అయితే...ఈ హడావుడి ఏమీ లేకుండానే సింపుల్‌గా మన స్మార్ట్‌ఫోన్‌తో రావణదహనం చేయొచ్చు. ఫోన్‌తో దహనం ఏంటి..? అని డౌట్ వచ్చినా...ఇది నిజం చేసి చూపించారు యూపీకి చెందిన విద్యార్థులు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గోరఖ్‌పూర్‌లోని Institute of Technology and Management (ITM) విద్యార్థులు దీన్ని ఆవిష్కరించారు. జస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై క్లిక్ చేసి రావణ దహనం చేసి చూపించారు. ANI షేర్ చేసిన ఈ వీడియోని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో...ముందుగా విద్యార్థులు రావణుడి బొమ్మను దహనానికి సిద్ధం చేశారు. ఇది పూర్తయ్యాక...అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లారు. మొబైల్‌లో డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి రావణుడి బొమ్మను కాల్చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
#WATCH उत्तर प्रदेश: गोरखपुर के इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड मैनेजमेंट के B. Tech के छात्रों ने मोबाइल फोन के माध्यम से 'रावण' का पुतला जलाने का एक स्मार्ट तरीका खोजा है। (3.10) pic.twitter.com/2TIqseUrTE
— ANI_HindiNews (@AHindinews) October 3, 2022
good achievement use this other
— Amanprajapate (@Amanpra38318938) October 4, 2022
Superb 👌👌🥰🥰
— Ani (@AniketK23754300) October 4, 2022
रावण' का पुतला जलाने का एक स्मार्ट तरीका
— Amit Kumar (@AMITKUM79133357) October 4, 2022
SAFE TOO https://t.co/2Evu1lfkqW
Also Read: Om Raut on Adipurush Trolls : మొబైల్స్‌లో చూస్తే? - 'ఆదిపురుష్' టీజర్ ట్రోల్స్, మీమ్స్‌పై దర్శకుడు ఓం రౌత్ రియాక్షన్





















