Doctor Dancer: డాక్టరే కాదు డాన్సర్ కూడా - కానీ డ్యూటీ రూమ్‌లో లవర్‌తో చేస్తే ఊరుకుంటారా?
Doctor Dancing With Fiancée: యూపీలో ఓ డాక్టర్ కు ఎంగేజ్ మెంట్ అయింది. డ్యూటీకి వెళ్లాక..తన గదికి ఆమెను పిలించుకుని డాన్స్ చేశాడు. వీడియో తీసుకున్నాడు.

UP Govt Hospital Doctor Seen Dancing With Fiancée Inside Duty Room: ఆయన డాక్టర్. డ్యూటీ అంటే పేదలకు వైద్యం చేయడం అనుకోరు. డాన్సులు కూడాచేయవచ్చని అనుకుంటారు. ఒక్కడే అయితే బాగుండదని లవర్ ను కూడా పిలిపించుకుని .. డ్యూటీ గదిలో చిందులేశారు. ఇందులో స్నేక్ డాన్స్ కూడా ఉందండోయ్.
ఉత్తరప్రదేశ్‌లోని షమ్లీ జిల్లా కంధ్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డాక్టర్ తన లవర్ తో డాన్స్‌లు వేసిన వీడియో మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో బ్యాండ్ బాజా బారాత్ సినిమా సాంగ్ “డమ్ డమ్ మస్త్ హై…”కు లవర్ తో డాన్స్ చేశారు. వీడియో డ్యూటీ రూమ్ లో షూట్ చేసినట్టు కనిపిస్తోంది. డాన్సర్ డాక్టర్ పేరు సిద్ధిఖీగా గుర్తించారు.
यूपी –
— Sachin Gupta (@SachinGuptaUP) November 21, 2025
शामली जिले के एक सरकारी अस्पताल के ड्यूटी रूम में डॉक्टर का डांस, CMO ने नोटिस देकर जवाब मांगा !!
कहा जा रहा है कि डॉक्टर अफकार सिद्दीकी सगाई की खुशी में डांस कर रहे हैं और साथ में डांस करने वाली उनकी मंगेतर है। pic.twitter.com/q7FWRs7xdV
వీడియో వైరల్ కాగానే, షమ్లీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) వీరేంద్ర సింగ్ తక్షణమే చర్యలు తీసుకున్నారు. డాక్టర్ సిద్దీకీకు వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. సంతృప్తికరమైన సమాధానం దొరకకపోవడంతో ఆయన్ను ఎమర్జెన్సీ వార్డ్ డ్యూటీ నుంచి తొలగించారు. ఆయనకు కేటాయించిన రూమ్‌ను ఖాళీ చేయమని ఆదేశించారు. మొత్తం ఘటనపై వివరణాత్మక రిపోర్ట్‌ను సీనియర్ హెల్త్ అధికారులకు పంపారు, మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
उत्तर प्रदेश के शामली स्थित एक सरकारी अस्पताल में अफकार सिद्दीकी नामक डॉक्टर ड्यूटी रूम में एक महिला के साथ नाच रहे हैं। संभवतः महिला उनकी मंगेतर है।
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) November 21, 2025
इस पर कार्रवाई होनी चाहिए। अस्पतालों में इलाज की कमी से मरीज मर रहे हैं और ये जनाब महिला संग नाच रहे हैं। pic.twitter.com/8OHpJSBIIM
ఈ ఘటన గతంలో జరిగిన అలాంటి సంఘటనలను గుర్తు చేస్తోంది. 2024 ఏప్రిల్‌లో యూపీలోని హాపూర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్రమ్ బీట్స్‌పై డాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కర్ణాటకలో డాక్టర్ అభిషేక్ ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసి సస్పెండ్ అయ్యారు.





















