Mulayam Singh Yadav's Health: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు సీరియస్- ఐసీయూలో చికిత్స!
Mulayam Singh Yadav's Health: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది.
![Mulayam Singh Yadav's Health: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు సీరియస్- ఐసీయూలో చికిత్స! UP: Former CM Mulayam Singh Yadav's Health Deteriorates, Admitted To ICU Mulayam Singh Yadav's Health: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌కు సీరియస్- ఐసీయూలో చికిత్స!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/02/bbb41fa76b99dcbf5e31135b0179351e1664710955420218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mulayam Singh Yadav's Health: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.
#UPDATE | Haryana: Former UP CM & Samajwadi Party leader Mulayam Singh Yadav shifted to ICU at Medanta hospital in Gurugram https://t.co/9NhFJfwULH
— ANI (@ANI) October 2, 2022
కొద్ది రోజులుగా
గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం సీరియస్ కావడంతో ములాయంను గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ICUకి మార్చి, చికిత్స అందిస్తున్నారు. ములాయంకు వయసు మీద పడటంతో అనేక వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇటీవల
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ ఇటీవల మరోసారి ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత సమాజ్‌వాదీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు.
మేమే గెలిచాం!
ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకే ఓటు వేశారని, అయినా కూడా తమ నుంచి ప్రభుత్వాన్ని భాజపా లాక్కుందని అఖిలేశ్ విమర్శించారు.
" ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదు. భాజపా మళ్లీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. యూపీలో అధికారం కోల్పోతే దిల్లీలో కూడా కోల్పోతామని వారికి తెలుసు. అందుకే వారి యంత్రాంగం ద్వారా సమాజ్‌వాదీ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని భాజపా లాక్కుంది. భాజపా, దాని మిత్రపక్షాల ఆజ్ఞల మేరకు దాదాపు ప్రతి అసెంబ్లీ స్థానంలో 20 వేల వరకు యాదవులు, ముస్లింల ఓట్లను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. దీనిపై విచారణ జరిపితే చాలా మంది పేర్లను తొలగించినట్లు తెలుస్తుంది. "
అరెస్ట్‌లకు సిద్ధం
" జైళ్లకు వెళ్ళవలసి వచ్చినా కూడా మేం కేంద్ర, రాష్ట్రాల్లోని భాజపా ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉంటాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి. దిల్లీ, లఖ్‌నవూలో (కేంద్ర, రాష్ట్రాల్లో) ఉన్న ప్రభుత్వాలు వ్యవస్థలను కబ్జా చేశాయి. పోరాడటానికి మేం భయపడం. 2024 ఎన్నికల్లో భాజపాను ఓడించాలి. ఇందుకోసం మేం కలిసి పని చేస్తాం. సోషలిస్టులు, దళితుల మధ్య ఐకమత్యం రావాలి. ఈ వర్గాలవారు మా పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. అయినా రుణ మాఫీలు ఎక్కువగా గుజరాతీ వ్యాపారవేత్తలకే అందుతున్నాయి. పరిశ్రమలను గుజరాత్‌కు తీసుకెళ్లిపోతున్నారు. "
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)