By: ABP Desam | Updated at : 03 Oct 2023 10:53 PM (IST)
Edited By: omeprakash
యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఫలితాలు
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ-2)- 2023 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అక్టోబర్ 3న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల రూల్ నెంబర్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. పరీక్షలో మొత్తం 6908 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల వివరాలను తుది ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో ఉంచుతామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఇండియన్ మిలటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలలో ఖాళీల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబర్ 3న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
UPSC CDS 2 result 2023: ఫలితాలు ఇలా చూసుకోండి...
1) ఫలితాల కోసం మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. - upsc.gov.in
2) అక్కడ హోంపేజీలో “What’s New” లింక్ మీద క్లిక్ చేయాలి.
3) ఇప్పుడు “Written Result (with name): Combined Defence Services Examination (II), 2023” ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
4) సీడీఎస్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలు ఉంటాయి.
5) 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే.
6) ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని 349 ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెల్లిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల అధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ విధానం: ఈ విభాగానికి 300 మార్కులుంటాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ) పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ALSO READ:
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంస్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సాఫ్ట్‌వేర్ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ, ఈ అర్హతలుండాలి
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఫుల్‌స్టాక్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ కోర్సులో ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ రాఘవేందర్‌రావు తెలిపారు. ఈ మేరకు సెప్టెంబరు 29న ఒక ప్రకటలో తెలిపారు. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. బీసీఏ, బీఎస్సీ(సీఎస్), బీటెక్(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ) పూర్తిచేసిన వారికి ఫుల్‌స్టాక్ డెవలపర్ సాఫ్ట్‌వేర్ కోర్సులో మూడునెలల పాటు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలనూ కల్పిస్తామని పేర్కొన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ
Detailed Application Form-II: సివిల్ సర్వీసెస్ డీఏఎఫ్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు
Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు
TSPSC Chairman Resigns: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?
Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు
/body>