News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NBE Jobs: నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 48

పోస్టుల వారీగా ఖాళీలు:..

➥ డిప్యూటీ డైరెక్టర్‌ (మెడికల్‌): 07

➥ లా ఆఫీసర్‌: 01

➥ జూనియర్‌ ప్రోగ్రామర్‌: 06

➥ జూనియర్‌ అకౌంటెంట్‌: 03

➥ స్టెనోగ్రాఫర్: 07

➥ జూనియర్‌ అసిస్టెంట్‌: 24

అర్హత: పోస్టులను అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ బీటెక్‌/ బీఈ/ బీసీఏ/ పీజీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 18-35 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.  

ముఖ్యమైన తేదీలు..

➥నోటిఫికేషన్ వెల్లడి: 21.09.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2023.

Notification

Website 

ALSO READ:

ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ ఉద్యోగాలు, వివరాలు ఇలా
ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివే
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 30 Sep 2023 04:51 PM (IST) Tags: National Board of Examinations NBE Recruitment NBE Notification Goverment Jobs

ఇవి కూడా చూడండి

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

HSL Recruitment: వైజాగ్‌ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-2 పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

CSIR UGC NET 2023: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

CSIR UGC NET 2023:  సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RRC: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్‌,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం మాస్టర్ ప్లాన్

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్‌,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం మాస్టర్ ప్లాన్

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?

Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు -  ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?