Union Budget 2024: విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ లోన్, కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్
Union Budget 2024 Highlights: కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ కేటాయింపులు చేసింది మోదీ సర్కార్. నైపుణ్య శిక్షణకూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
Union Budget 2024 Live Updates: విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. విద్య, ఉద్యోగ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది. మొత్తంగా 5 స్కీమ్‌లు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తంగా రూ.2 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మొత్తం మూడు పథకాలు అమలు చేస్తామని తెలిపారు. నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. విద్యారంగానికి తోడ్పాటునిచ్చేందుకు వీలుగా దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు రూ. 10 లక్షల వరకూ లోన్ ఇస్తామని కీలక విషయం వెల్లడించారు.
Budget 2024 | On Education loans, FM Sitharaman says,"Govt to provide financial support for loans up to Rs 10 lakhs for higher education in domestic institutions." pic.twitter.com/nH3daipqEW
— ANI (@ANI) July 23, 2024
ఈ మేరకు Model Skill Loan Scheme లో సవరణలు చేశారు. ఏటా అర్హులైన 25 వేల మంది విద్యార్థులకు ఈ రుణం అందించేలా ప్రణాళికలు రచించినట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనుంది. ఏటా లక్ష మంది విద్యార్థులకు 3% వడ్డీతో రూ. 10 లక్షల రుణం అందిస్తామని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్. మహిళలపైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ద్వారా రూ.7.5 లక్షల వరకూ లోన్ ఇచ్చేలా భరోసా కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏటా ఈ పథకం ద్వారా 25 వేల మందిలి లబ్ధి చేకూరుస్తామని వెల్లడించింది.