By: Ram Manohar | Updated at : 29 Dec 2022 02:58 PM (IST)
ఉక్రెయిన్‌పై వందకుపైగా మిజైల్స్‌తో విరుచుకు పడింది రష్యా.
Ukraine Russia War:
దద్దరిల్లిన ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై అంతకంతకూ దాడుల తీవ్రత పెంచుతూ పోతోంది రష్యా. ఇప్పటికే కీలక ప్రాంతాలపై క్షిపణుల దాడులు చేసి ఎన్నో భవంతులను నేలమట్టం చేసింది. ఇప్పుడు ఏకంగా 120 మిసైల్స్‌తో విరుచుకు పడింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో చాలా సేపటి వరకూ గాల్లో సైరన్‌లు మోగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో సహా చాలా ప్రాంతాల్లో ఈ దాడుల శబ్దాలు భయంకరంగా వినిపించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మొత్తం 120 మిసైల్స్‌ను లాంచ్ చేశామని పుతిన్ సలహాదారు ఒకరు స్పష్టం చేశారు. మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు స్పష్టం చేశారు. ఓ 14 ఏళ్ల బాలికతో పాటు మొత్తం ముగ్గురు ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖార్కివ్, ఒడెశా, ల్వివ్, జైటోమిర్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. రష్యా అన్ని దిక్కుల నుంచి దాడులు మొదలు పెట్టిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. క్రూజ్ మిజైల్స్‌తో దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. సెల్ఫ్ ఎక్స్‌ప్లోడింగ్ డ్రోన్స్‌తో ఇప్పటికే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసింది రష్యా. ఒక్క ఒడెశా ప్రాంతంపైనే 21 మిసైల్స్‌తో దాడి చేసింది. అత్యంత కీలకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు చేసింది రష్యా సైన్యం.
యుద్ధం ఆపేస్తాం కానీ.. కండీషన్స్ అప్లై..
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై దాదాపు 11 నెలల పూర్తవుతోంది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు.. ఉక్రెయిన్ కూడా పట్టు వదలడం లేదు. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య చర్చల అంశం తెరపైకి వచ్చింది. కానీ రష్యా మాత్రం తమ షరతులకు ఒప్పుకుంటే యుద్ధాన్ని ముగిస్తామని తేల్చి చెబుతోంది. యుద్ధాన్ని ముగించాలంటే మా షరతులు ఏమిటో ఉక్రెయిన్‌కు బాగా తెలుసని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. వాటిని పూర్తిచేస్తే ఆ దేశానికే మంచిదని లేకపోతే తమ సైన్యం నిర్ణయిస్తుందని లావ్రోవ్ నేరుగా హెచ్చరించారు.
" వారి పాలనలో నిస్సైనికీకరణ, నాజీ రహితంగా చేసి అక్కడి నుంచి రష్యాకు ఉన్న ముప్పును తొలగించాలన్నది మా ప్రతిపాదన. వీటితోపాటు కొత్తగా మాకు వచ్చిన భూభాగాల్లో కూడా ఇలా చేయాలి. ఈ విషయాలు మా ప్రత్యర్థికి తెలుసు. ఇది చాలా సింపుల్ పాయింట్. మీ మంచికే వాటిని పూర్తి చేసుకోండి. లేకపోతే ఈ విషయాన్ని రష్యా సైన్యం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం బంతి వారి కోర్టులో ఉంది. వారి వెనక వాషింగ్టన్ ఉంది. "
- సెర్గీ లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి
ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. అయితే చర్చలకు తాము సిద్దమని కానీ ఉక్రెయిన్ వెనుకాడుతోందన్నారు.
Also Read: Vladimir Putin: పుతిన్‌ను ఎత్తి పడేసిన చిన్నారి,ఆశ్చర్యపోతున్న నెటిజన్లు - వైరల్ వీడియో
Breaking News Live Telugu Updates: వసుధ గ్రూప్ సంస్థల ఆఫీస్‌ల్లో ఐటీ సోదాలు, 40కి పైగా బృందాలు రంగంలోకి
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు- రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్, ఆప్
ఆస్ట్రేలియలో చిన్న క్యాప్సూల్ ఉన్న ట్రక్ అదృశ్యం- కంగారుల దేశానికి నిద్ర కరవు
AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే