By: Ram Manohar | Updated at : 15 Feb 2023 01:13 PM (IST)
యూకేలో ఓ ఉద్యోగికి బట్టతల ఉందని జాబ్‌లో నుంచి తీసేసింది.
UK Sales Director Fired:
బట్టతల ఉందని ఫైర్..
ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీల ఉద్యోగులందరిదీ ఒకటే టెన్షన్. జాబ్ ఉంటుందా..? ఊడుతుందా..? అని తలలు పట్టుకుంటున్నారు. వరుసగా పెద్ద సంస్థలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపుతోంది. అప్పటికప్పుడు ప్యాకేజ్ ఇచ్చేసి సాగనంపుతున్నారు. బ్రిటన్‌లోనూ ఈ లేఫ్‌లు కొనసాగుతున్నాయి. ఏదో ఓ కారణం చెప్పి ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి యాజమాన్యాలు. కానీ...బ్రిటన్‌లోని ఓ కంపెనీ ఉద్యోగిని వింత కారణం చెప్పి తప్పించేశారు. ఆ కారణం వింటే మీరూ ఆశ్చర్యపోతారు. ఏకంగా సేల్స్ డైరెక్టర్‌కే షాక్ ఇచ్చింది కంపెనీ. ఇంతకీ ఎందుకు తీసేసిందో తెలుసా..? ఆయనకు బట్టతల ఉందని. నిజమే. కేవలం బట్టతల ఉందన్న కారణంగా 61 ఏళ్ల మార్క్ జోన్స్‌ను తొలగించింది ఆ కంపెనీ. సేల్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయనను ఉన్నట్టుండి ఇలా ఫైర్ చేసేసింది. ఆ కంపెనీ పేరు Tango.తలపై ఒక్క వెంట్రుక కూడా లేదని వింత కారణం చూపిస్తూ "ఇక మీ అవసరం మాకు లేదు. వెళ్లిపోవచ్చు" అని సింపుల్‌గా పింక్ స్లిప్ చూపించింది. ఇది విని షాక్ అయిన ఆ ఉద్యోగి "ఏం చేస్తాంలే" అని లైట్ తీస్కోలేదు. బాడీ షేమింగ్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యాడు. కోర్టులోనే తేల్చుకుందాం అంటూ పిటిషన్ వేశాడు. ఇది వివక్ష అంటూ కోర్టులో కేసు వేశాడు. దీనిపై విచారించిన కోర్టు...కంపెనీపై మండి పడింది. అంతే కాదు. కంపెనీకి 71వేల పౌండ్ల జరిమానా కూడా విధించింది. ఆ మొత్తాన్ని పరిహారం కింద ఉద్యోగికి ఇచ్చేయాలని తేల్చి చెప్పింది. మన కరెన్సీలో ఇది రూ.70 లక్షలు.
ఈ మొత్తం వివాదంపై Tango కంపెనీ ఓనర్ ఫిలిప్ హెస్కెత్ స్పందించాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు కూడా. "నా టీమ్‌లో ముసలి వాళ్లు, బట్టతల ఉన్న వాళ్లు ఉండటం నాకిష్టం లేదు. అందుకే తొలగించాల్సి వచ్చింది" అని చెప్పాడు. ఆఫీస్ పాలిటిక్స్‌కి ఆ ఉద్యోగి బలి అయిపోయాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
భారీగా లేఆఫ్‌లు..
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. కొన్ని సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటాతో మొదలైన ఈ ట్రెండ్...అన్ని కంపెనీలకు విస్తరించింది. ఇప్పుడు మరోసారి మెటా కంపెనీ లేఆఫ్‌లు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. Financial Times రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా పలు టీమ్‌లకు అవసరమైన బడ్జెట్‌ను రిలీజ్ చేయలేదు. అంటే...ఇన్‌డైరెక్ట్‌గా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు సంకేతాలిచ్చింది. ఉద్యోగులను తొలగించిన తరవాతే బడ్డెట్‌లు విడుదల చేయాలని భావిస్తోంది యాజమాన్యం. ఇప్పటికే ఉద్యోగుల్లో లేఆఫ్‌ల భయం మొదలైంది. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ ఇస్తారో అని కంగారు పడిపోతున్నారు. గతేడాది నవంబర్‌లో ఒకేసారి 11 వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం సంచలనమైంది. ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో ఇది 13%. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో మొత్తంగా కలిపి 11 వేల మందిని ఇంటికి పంపింది మెటా. ఇటీవలే జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో కీలకమని చెప్పారు. మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు.
Also Read: Twitter CEO: ట్విటర్ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ
Coronavirs Cases India: మళ్లీ టెన్షన్ పెడుతున్న కరోనా, కొత్త స్ట్రాటెజీ ప్రకటించిన కేంద్రం
Kakinada Crime : గ్రామ దేవత జాతరలో కాలు తొక్కాడని గొడవ, ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి!
Unesco Report: మరో పాతికేళ్ల తర్వాత భారత్‌లో నీళ్లు దొరకవట - భయపెడుతున్న యునెస్కో రిపోర్ట్
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు