(Source: ECI/ABP News/ABP Majha)
Twitter CEO: ట్విటర్ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్
Twitter CEO: ట్విటర్‌కు కొత్త సీఈవో వచ్చారంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.
Twitter CEO Dog:
శునకమే సీఈవో అట..
ట్విటర్‌కు కొత్త సీఈవోని అపాయింట్ చేశారు ఎలన్ మస్క్. అదేంటి..? మొన్నే కదా ఆయన ట్విటర్‌ను కొన్నది. మళ్లీ కొత్త సీఈవో ఏంటి..అనుకుంటున్నారా. ఇది మేం చెప్పింది కాదు. స్వయంగా ఎలన్ మస్క్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే...కొత్త CEO మనిషి కాదు. ఆయన పెంపుడు కుక్క. దాని పేరు Floki.అంతకు ముందు సీఈవోల కన్నా ఇదే బెటర్ అంటూ పరాగ్ అగర్వాల్‌కు పరోక్షంగా చురకలు అంటించారు మస్క్. 44 బిలియన్ డాలర్లు పెట్టి ట్విటర్‌ను కొన్న మరు క్షణమే అప్పటి CEO పరాగ్ అగర్వాల్‌ను తొలగించారు మస్క్. ఆయన ఒక్కరే కాదు. ట్విటర్ లీగల్ అడ్వైజర్ విజయ గద్దె, CFO నెల్ సెగల్‌నూ తప్పించారు. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది అనుకుంటే...ఇప్పుడు మరోసారి ఈ ట్వీట్‌తో బయట పడింది. CEO కుర్చీలో తన పెంపుడు శునకం కూర్చున్న ఫోటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు ఎలన్ మస్క్. ఆ శునకం ముందు ఓ టేబుల్ ఉంది. దానిపై ఓ చిన్న ల్యాప్‌టాప్ కూడా ఉంది. కొత్త సీఈవో అర్జెంట్‌గా మెయిల్ చేసే పనిలో ఉన్నట్టుగా ఫోజ్ పెట్టింది ఆ శునకం. ఈ సీఈవో స్టైల్ అదిరిపోయిందంటూ మరో ట్వీట్ చేశారు మస్క్. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
He’s great with numbers! pic.twitter.com/auv5M1stUS
— Elon Musk (@elonmusk) February 15, 2023
And has 🔥🔥 style pic.twitter.com/9rcEtu9w1Z
— Elon Musk (@elonmusk) February 15, 2023
ఇండియాలోనూ బ్లూ టిక్ ఫీచర్..
ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక ఎలన్ మస్క్ రెవెన్యూ పెంచుకునే మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగానే..బ్లూ టిక్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రకటించారు. అందుకు కొంత ధర కూడా నిర్ణయించారు. అంటే...ఇకపై ట్విటర్ యూజర్స్ ఎవరైనా బ్లూ టిక్ కావాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్విటర్..ఇప్పుడు ఇండియాలోనూ దీన్ని లాంఛ్ చేసింది. ఇండియా యూజర్స్ ట్విటర్ బ్లూ ఫీచర్‌ను వినియోగించు కోవాలనుకుంటే నెలకు రూ.650 చెల్లించాలి. ఇది వెబ్ యూజర్స్‌కి. అదే మొబైల్ యూజర్స్ అయితే..రూ.900 కట్టాలి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్‌లో ఈ సర్వీస్ మొదలైంది. అక్కడి వెబ్ యూజర్స్ నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూ టిక్ ఉంటుంది. అదే ఏడాదికైతే 84 డాలర్లు చెల్లించాలి. అదే యాండ్రాయిడ్ యూజర్స్ అయితే ట్విటర్ బ్లూ టిక్ కోసం అదనంగా 3 డాలర్లు చెల్లించాలి. అయితే...ఇందులో నుంచి కొంత వాటా గూగుల్‌కు కమీషన్ కింద ఇచ్చేస్తుంది ట్విటర్. ఇండియాలో ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ కోసం రూ. 6,800 కట్టాలని కంపెనీ వెల్లడించింది. త్వరలో ఎలాన్ మస్క్ ట్విట్టర్లో గోల్డ్ టిక్‌ను మెయింటెయిన్ చేయడానికి కంపెనీల నుంచి నెలకు 1,000 డాలర్లు వసూలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ట్విట్టర్లో కంపెనీలకు గోల్డ్ టిక్ ఇస్తారని సంగతి ఇప్పటికే తెలిసిందే.