అన్వేషించండి

Viral News: నీ ముఖం భయంకరంగా ఉంది, రెస్టారెంట్ నుంచి బయటికెళ్లు- లండన్ వ్యక్తికి తీవ్ర అవమానం

UK Man : ఆలివర్ బ్రోమ్లీ అనే 42 ఏళ్ల వ్యక్తి న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. కస్టమర్లు అంతా అతడి విచిత్రమైన ముఖాన్ని చూసి కాస్త ఇబ్బంది పడ్డారు.

Facial Disfigurement: ఆకలేస్తుందని రెస్టారెంట్ కు వెళితే నీ ముఖం బాలేదు.. నిన్ను చూసి అందరూ భయపడుతున్నారని ఓ వ్యక్తిని బయటకు వెళ్లగొట్టిన సంఘటన యూకేలో చోటు చేసుకుంది. ఆలివర్ బ్రోమ్లీ అనే 42 ఏళ్ల వ్యక్తి న్యూరోఫైబ్రోమాటోసిస్ టైప్ 1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతడి ముఖం మీద విపరీతమైన కణితులు వచ్చి చూసేందుకు భయంకరంగా ఉంది. దీంతో అతడు రెస్టారెంట్ వెళ్లగా సదరు యాజమాన్యం ఇతర కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుందని అతడిని బయటకు వెళ్లగొట్టింది. దీంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఆతిథ్య రంగంలో వారికి ఎక్కువ అవగాహన కావాలని, ఈ సంఘటన ఎంతో కలచి వేసిందని పేర్కొన్నాడు.  
 
ముఖాన్ని చూసి భయపడిన కస్టమర్లు 
కాంబెర్‌వెల్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో బ్రోమ్లీ తనకు వచ్చిన జన్యుపరమైన వ్యాధికి చికిత్స పొందుతున్నాడు. అయితే ఆగస్టు నెలలో బాగా ఆకలి వేయడంతో మధ్యాహ్న భోజనం కోసం స్థానిక రెస్టారెంట్‌ లోకి వెళ్లాడు. భోజనం ఆర్డర్ ఇద్దామని రెస్టారెంట్ లోపలికి వెళ్లాడు. అక్కడ మిగతా కస్టమర్లు అంతా అతడి విచిత్రమైన ముఖాన్ని చూసి కాస్త ఇబ్బంది పడ్డారు. కొంతమంది భయంతో అతడిని పంపించమని రెస్టారెంట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో  బ్రోమ్లీని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఓ సిబ్బంది అతడికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా బ్రోమ్లీ మాట్లాడుతూ.. "నేను కస్టమర్లను భయపెడుతున్నానని వారు నాకు చెప్పారు " అని అన్నాడు. 

 దిగ్భ్రాంతికరమైన ఘటన 
ఈ ఘటన నాకు దిగ్భ్రాంతి, బాధ కలిగించినప్పటికీ వారి నిర్ణయానికి అడ్డు చెప్పకుండా బ్రోమ్లీ నిశ్శబ్దంగా రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై తర్వాత బ్రోమ్లీ మాట్లాడుతూ.. నాపై ఫిర్యాదులు ఇంత త్వరగా వస్తాయని అనుకోలేదన్నారు. ఫిర్యాదు దారులపై అవిశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.  తన ముఖం కారణంగా సిబ్బందికి అసౌకర్యంగా ఉండవచ్చని సూచించాడు. తాను కనీసం కుర్చీలో కూర్చోలేదన్నారు. వారు నేను అక్కడ కూర్చోవడం కూడా వారికి ఇష్టం లేదన్నారు.  

పోలీసులకు ఫిర్యాదు
తనను ఎందుకు వెళ్లమంటున్నారో అని బ్రోమ్లీ అధికారిక ఫిర్యాదుతో రెస్టారెంట్‌ను సంప్రదించాడు. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. . తత్ఫలితంగా, అతను ఈ సంఘటనను పోలీసులకు నివేదించాడు. అతను దానిని ద్వేషపూరిత నేరంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు. కానీ మీడియా ప్రశ్నించగా చర్యలు తీసుకుంటామని బ్రోమ్లీకి హామీ ఇచ్చారు. ప్రస్తుతం సర్రేలోని రీగేట్‌లో నివసిస్తున్న బ్రోమ్లీ, తాను రెస్టారెంట్‌పై ప్రతీకారం తీర్చుకోవడం లేదని నొక్కి చెప్పాడు. కానీ తనకు జరిగిన అనుభవం మరొకరికి జరుగకూడదన్నారు. బ్రోమ్లీ మాట్లాడుతూ.. "ఇది నా గురించి కాదు. నాకు ప్రతీకారం వద్దు.. నేను ముఖ వైకల్యాలు, ముఖ వ్యత్యాసాల గురించి అవగాహన కల్పించాలనుకుంటున్నాను" అని అతను చెప్పాడు. బ్రోమ్లీ వంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకు మద్దతిచ్చే స్వచ్ఛంద సంస్థ యూకే నెర్వ్ ట్యూమర్స్ ఈ సంఘటనపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు మరో సారి జరుగకుండా యూకే హాస్పిటాలిటీకి లేఖలు పంపినట్లు స్పష్టం చేశారు. 

Also Read: సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget