Udhayanidhi Stalin : నేను కరుణానిధి మనవడ్ని తగ్గేదే లేదు - తేల్చేసిన ఉదయనిధి - పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనా ?
Sanatana Dharma : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే ప్రశ్నేలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. పవన్ ఉదయనిధిపై విమర్శలు చేసిన తర్వాత ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది.
Udhayanidhi Stalin Stands Firm On Sanatana Dharma Remarks: కలైజ్ఞర్ కరుణానిధి మనవడినని ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సనాతన ధర్మంపై తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానన్నారు. వాటిపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేాశారు. పెరియార్, కరుణానిధి బాటలోనే నడుస్తామన్నారు.తాను చేసిన వ్యాఖ్యలపై దేశంలోని అనేక కోర్టుల్లో పిటిషన్లు వేశారని న్యాయపోరాటం చేస్తాను కానీ వెనక్కి తగ్గేది లేదని..క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు.
సనాతనధర్మం వైరస్ లాంటిదన్న ఉదయనిధి
గతంలో ఉదయనిధి సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనేక విమర్శల వచ్చాయి. దేశంలో అనేక చోట్ల కోర్టుల్లో ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఆ విషయం సద్దుమణిగింది. ఇటీవల పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ను ప్రకటించినప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. అలాంటి వారికి న్యాయస్థానాలు రక్షణలు కల్పిస్తున్నాయన్నారు. పవన్ కల్యాణ్ నేరుగా ఉదయనిధి పేరు ప్రస్తావించకపోయినా తమిళనాడులో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
Dindigul | Tamil Nadu Deputy Chief Minister Udhayanidhi Stalin said, "I also mentioned the principles given by Periyar, Perarignar Anna, and our leader Kalaignar. But my statements were distorted falsely and I have now been sued in several courts in India, not only in Tamil Nadu.… pic.twitter.com/pX17fOTTR4
— ANI (@ANI) October 22, 2024
ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూనే సనాతన ధర్మంపై వ్యతిరేక కామెంట్లు
పవన్ కల్యాణ్ విమర్శలపై ఉదయనిది స్టాలిన్ నేరుగా స్పందించలేదు. వెయిట్ అండ్ సీ అని ఒక్క మాట అన్నారు. కానీ డీఎంకే మాత్రం అధికారికంగా వివరణ ఇచ్చింది. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాము అన్ని మతాలను సమానంగా చూస్తామని హిందూత్వాన్ని వ్యతిరేకిస్తామని చెప్పలేదన్నారు. అయితే కులపరమైన వివక్షను మాత్రం సహించేది లేదన్నారు. దానిపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. సనాతన ధర్మం అంటే కుల వివక్ష అన్న కోణంలోనే తాము విమర్శలు చేశామని మతం కాదని డీఎంకే పరోక్షంగా చెబుతోంది.
తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు ఒకే భావజాలంతో ఉంచాయి. అన్నాదురై , పేరియార్ కుల, మత వివక్షలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాల భావజాలం ఇప్పటికీ అక్కడి ప్రజల్లో బలంగా ఉంది.