Uddhav vs Eknath: ఉద్ధవ్ ఠాక్రేకు కోలుకోలేని దెబ్బ- సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!
Uddhav vs Eknath: నిజమైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది.
Uddhav vs Eknath: ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో శివసేన పార్టీ.. విల్లు, బాణం గుర్తును ఎవరికి కేటాయించాలనే అంశాన్ని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
#BREAKING Supreme Court Constitution Bench refuses to stop the Election Commission of India from deciding the claim of Eknath Shinde group as the real #ShivSena. Dismisses the application for stay filed by #UddhavThackeray group after a day long hearing.#SupremeCourtOfIndia
— Live Law (@LiveLawIndia) September 27, 2022
ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఒక రోజు సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
మాదంటే మాదని!
శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. దీంతో ఇరు వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. తమదే నిజమైన శివసేన అని ఏక్‌నాథ్ శిందే వర్గం చెప్పటంతో పాటు, శివసేన
పార్టీ గుర్తుని తమకే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే విచారణ తేలేంత వరకూ ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు గతంలో తేల్చి చెప్పింది.
ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఇంకా శివసేన ఎవరిది అన్న చర్చ వాడివేడిగా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. శివసేనలో ఎవరికి మెజార్టీ ఉందో డాక్యుమెంట్ రూపంలో ఆధారాలు సమర్పించాలని ఏక్‌నాథ్ శిందేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేను కూడా అడిగింది. ఈ అంశంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఎన్నోసార్లు స్పందించారు. బాలాసాహెబ్ స్థాపించిన శివసేనను కేంద్ర ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందని విమర్శించారు. 56 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఇలా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఇదే అంశమై గతంలో ఏక్‌నాథ్ శిందే కూడా స్పందించారు.
Also Read: Kerala HC: 'అందుకు భర్త పర్మిషన్ అవసరం లేదు'- కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Also Read: Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు