Uddhav On Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రే నోట 'పుష్ప' డైలాగ్ - రెట్టింపు ప్రతీకారం తప్పదని మోదీకి వార్నింగ్!
Uddhav On Sanjay Raut: భాజపాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మాహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. భవిష్యత్తులో ప్రతీకారం తప్పదన్నారు.
Uddhav On Sanjay Raut: మోదీ నేతృత్వంలోని కేంద్రానికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ ఇచ్చారు. శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'పుష్ప' సినిమాలో డైలాగ్ చెప్పారు ఠాక్రే.
Proud of Sanjay Raut. There's a dialogue in 'Pushpa' - "jhukega nahi". But the real Shiv Sainik who won't bend is Sanjay Raut. Those who used to say they won't bend are all that side today. That's not the direction shown by Balasaheb. Raut is true Shiv Sainik: Uddhav Thackeray pic.twitter.com/Om0Q4auCVi
— ANI (@ANI) August 1, 2022
కస్టడీ
మరోవైపు పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసిన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ.. పీఎమ్ఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆగస్టు 8 వరకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే కోర్టు మాత్రం ఆగస్టు 4 వరకు సంజయ్ రౌత్‌ను కస్టడీకి ఇస్తూ ఆదేశాలిచ్చింది.
దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు.. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: BJP-JD(U): నితీశ్ కుమార్ యూటర్న్- లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసే బరిలోకి!
Also Read: Bengal Cabinet Reshuffle: పార్థ ఎఫెక్ట్- బంగాల్ కేబినెట్‌లో కొత్త ముఖాలు- దీదీ కీలక ప్రకటన