(Source: ECI/ABP News/ABP Majha)
Bengal Cabinet Reshuffle: పార్థ ఎఫెక్ట్- బంగాల్ కేబినెట్‌లో కొత్త ముఖాలు- దీదీ కీలక ప్రకటన
Bengal Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు చేస్తున్నట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
Bengal Cabinet Reshuffle: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ చటర్జీ అరెస్ట్‌తో కేబినెట్ మొత్తాన్ని మారుస్తారనే వార్తలను ఆమె ఖండించారు. అయితే నలుగురు లేదా ఐదుగురు కొత్త వాళ్లను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Many of them are writing a lot. We don't have plan to dissolve the whole ministry & form a new one. Yes, there will be a reshuffle. We lost ministers Subrata Mukherjee, Sadhan Pande. Partha is in jail so all their work has to be done. Not possible for me to handle alone: WB CM pic.twitter.com/wfMle4CMuq
— ANI (@ANI) August 1, 2022
బంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు.
ఈ పరిణామాల అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.
Also Read: TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు