అన్వేషించండి

రాముడిని లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించడమే మిగిలుంది, బీజేపీపై సంజయ్ రౌత్‌ సెటైర్లు

Ayodhya Mandir: రాముడిని బీజేపీ ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మిగిలుందని సంజయ్ రౌత్ సెటైర్లు వేశారు.

Ayodhya Mandir Opening:

బీజేపీపై అసహనం..

ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరాన్ని రాజకీయం చేస్తోందంటూ మండి పడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాముడిని అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మిగిలుందని సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన నేపథ్యంలో సంజయ్ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు అయోధ్య ప్రారంభోత్సవ వేడుకల్లో స్వచ్ఛత అనేదే లేకుండా పోయిందని, కేవలం బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమాన్ని వాడుకుంటోందని విమర్శించారు. 

"అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయం చేస్తోంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. బహుశా రాముడిని అభ్యర్థిగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందేమో. కేవలం రాముడి పేరు చెప్పుకుని ఇన్ని రాజకీయాలు చేస్తోంది బీజేపీ"

- సంజయ్ రౌత్, UBT శివసేన ఎంపీ

గతంలోనూ..

గతంలోనూ రౌత్‌ అయోధ్య రామ మందిరంపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయోధ్య ఉత్సవం కేవలం బీజేపీ ఈవెంట్ అని...దానికి దేశానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఉద్దవ్ థాక్రే వెళ్తారా అన్న ప్రశ్నకు సంజయ్ రౌత్‌ సమాధానమిచ్చారు. బీజేపీ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తరవాతే ఆయన అయోధ్యను సందర్శిస్తారని వెల్లడించారు. 

"అయోధ్యలో బీజేపీ ఈవెంట్స్‌ అన్నీ పూర్తయ్యాక ఉద్దవ్ థాక్రే తప్పకుండా అయోధ్య రాముడిని దర్శించుకుంటారు. అయినా బీజేపీ ఈవెంట్‌కి మేమెందుకు వెళ్లాలి..? ఇందుకోసం ఆ పార్టీ చాలా ఆర్భాటం చేస్తోంది. అందులో ఎక్కడా స్వచ్ఛతా కనిపించడం లేదు"

-  సంజయ్ రౌత్, UBT శివసేన ఎంపీ

ప్రాణప్రతిష్ఠ జరిగే ముందే కీలక కార్యక్రమాలు నిర్వహించనుంది ట్రస్ట్. జనవరి 17న బాలరాముడి విగ్రహ అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజున భక్తులు మంగళ్ కలశంలో సరయు నది నీళ్లు తీసుకొస్తారు. జనవరి 18న గణేశ్ పూజతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తరవాత వరుణ పూజ, మాత్రిక పూజ, వాస్తు పూజలు జరుగుతాయి. జనవరి 19వ తేదీన హోమం చేయనున్నారు. జనవరి 20న వాస్తు శాంతి చేస్తారు. జనవరి 21వ తేదీన రాముడి విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ఇక చివరగా జనవరి 22న మృగశిర నక్షత్రంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?
Embed widget